Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుముల రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం. రేవంత్ రెడ్డికి సీఎం పదవిని అప్పగించినందున సీనియర్లకు కీలక పదవులు కేటాయించే అవకాశం ఉంది.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
రేవంత్ రెడ్డికి సీఎం పదవిని అప్పగించినందున మరో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులను అప్పగించనున్నారని సమాచారం. అయితే డిప్యూటీ సీఎం పదవి ఒక్కటే ఉండాలని మల్లు భట్టి విక్రమార్క పార్టీ నాయకత్వం వద్ద పట్టుబట్టినట్టుగా ప్రచారం సాగింది. సామాజిక వర్గాల ప్రకారంగా ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుందని సమాచారం.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
దళిత సామాజిక వర్గం నుండి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సామాజిక వర్గం నుండి పొన్నం ప్రభాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుండి సీతక్కలను డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన 64 మంది ఎమ్మెల్యేల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వీరిలో ఎక్కువ మంది కొత్తవాళ్లు. మరికొందరు సీనియర్లున్నారు.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
వెలమ సామాజిక వర్గం కోటాలో మంచిర్యాల నుండి విజయం సాధించిన ప్రేం సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు,గండ్ర సత్యనారాయణ రావులు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రేం సాగర్ రావు, గండ్ర సత్యనారాయణలు కూడ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
రెడ్డి సామాజిక వర్గం కోటాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
బీసీ సామాజిక వర్గం నుండి కొండా సురేఖ, ఈర్లపల్లి శంకర్, పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి,బీర్ల అయిలయ్య,ఆది శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఎస్‌సీ సామాజిక వర్గం నుండి మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, వంశీకృష్ణ, అద్దంకి దయాకర్ లు పోటీ పడుతున్నారు. అద్దంకి దయాకర్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు కూడ ప్రమాణం చేసే అవకాశం లేకపోలేదు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమతుల్యతను పాటించనున్నారు.
Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలలో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే. దీంతో రేవంత్ రెడ్డి కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కే అవకాశం లేకపోలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గాల్లో కూడ తుమ్మల నాగేశ్వరరావు పనిచేసిన అనుభవం ఉంది. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వీడి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.