నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి వద్దనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పదవిని జైపాల్ రెడ్డికి కట్టబెట్టాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకత్వం చేసింది.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
అయితే ముఖ్యమంత్రి పదవిని తీసుకొనేందుకు జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. అయితే అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పదవి రేసులో ముందంజలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించడమే లాంఛనమనే ప్రచారం సాగుతుంది.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
తెలంగాణలో సీఎల్పీ నేత పేరును ఇవాళ సాయంత్రం లోపుగా ప్రకటించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఈ సమయంలో తెలంగాణకు చెందిన వారిని సీఎం చేయాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒక దశలో ఆలోచన చేసింది.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
కేంద్ర మంత్రిగా ఉన్న సూదిని జైపాల్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనే యోచన కూడ కాంగ్రెస్ నాయకత్వం చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. ఆనాడున్న పరిస్థితుల్లో సీఎం పదవి తీసుకోవడం మంచిదికాదనే అభిప్రాయంతో జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆనాడు ఈ ప్రతిపాదనకు జైపాల్ రెడ్డి అంగీకరించి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సూదిని జైపాల్ రెడ్డి అల్లుడే ఎనుముల రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి సోదరుడి కూతురే రేవంత్ రెడ్డి సతీమణి. రేవంత్ రెడ్డి సతీమణి బాల్యంలో జైపాల్ రెడ్డి ఇంట్లోనే పెరిగింది.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం నిన్న హైద్రాబాద్ లో జరిగింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. ఎమ్మెల్యేల నుండి వ్యక్తిగతంగా అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సేకరించారు.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో బిజీ బిజీగా ఉంది. దీంతో కాంగ్రెస్ పరిశీలకులను హైద్రాబాద్ రావాలని కోరింది. దీంతో డీ.కే. శివకుమార్ సహా మరో నలుగురు పరిశీలకులు నిన్న సాయంత్రమే ఢిల్లీకి వెళ్లారు.
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *
తెలంగాణ సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ అధిష్టానానికి అందించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం డీకే శివకుమార్ సహా ఇతర పరిశీలకులతో ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు.సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారు.