శనివారం తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉంటుంది... పెద్దగా వర్షాలేమీ ఉండవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని ప్రకటించింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
నేడు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రటించారు. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో చిరుజల్లులు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపారు. రేపు(ఆదివారం) మాత్రం హైదరాబాద్ తో పాటు వెస్ట్, సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.