ఈ బదిలీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ముఖ్యమైన బాధ్యతలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా చర్యలు మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక్, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు-పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు.
ఐఏఎస్ బదిలీలలో ప్రధాన మార్పులు ఇలా..
- ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ: స్మితా సబర్వాల్
- గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్: శశాంక్ గోయెల్
- జీహెచ్‌ఎంసీ కమిషనర్: ఆర్వీ కర్ణన్
- యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో: ఎస్. వెంకట్ రావు
- ఫ్యూచర్ సిటీ కమిషనర్: శశాంక
- జెన్‌కో సీఎండీ: హరీష్
- హెల్త్ డైరెక్టర్: సంగీత సత్యనారాయణ
- పరిశ్రమల, పెట్టుబడుల సీఈవో: జయేశ్ రంజన్