KTR Alleges CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్‌కు పదవిగండం ఉన్నందున తన మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది.
రాష్ట్రంలో హామీలను అమలు చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ కేబినెట్‌లోని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రులంతా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్‌కు తన పదవి ఎక్కడ ఊడిపోతుందో అని భయం పట్టుకుందని, ఈక్రమంలోనే మంత్రులందరి ఫోన్లను ట్యాంపింగ్ పెట్టినట్లు ఆరోపించారు.
26
ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల తీరు ఒక్కటేనని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తే.. బీజేపీ పెద్దలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణకు ఆర్‌ఎస్ బ్రదర్స్.. కాంగ్రెస్, బీజేపీ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
36
రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఒకవేళ రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. రేవంత్ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మంత్రులు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
46
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. కొందరు పెద్దల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని కేటీఆర్ ఆరోపించారు. మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయని, కేసీఆర్ సర్కార్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వరంగల్‌లో జరిగే సభకు ప్రజల మద్దతు బీఆర్‌ఎస్‌కు ఏవిధంగా ఉండబోతుందో త్వరలోనే తెలుస్తుందన్నారు.
56
BRS Working President KT Rama Rao (File Photo/ANI)
కాంగ్రెస్ ఏడాది పాలలోనే ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు రేవంత్ సర్కార్‌కు గుణపాఠం చెబుతారని కేటీఆర్ తెలిపారు.మ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్పా.. రాష్ట్రంలో చేసిన ఒక్క మంచి పనికూడా లేదన్నారు.
66
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)
సీఎం రేవంత్ ఓ అపరిచితుడిలా ఉంటున్నాడని కేటీఆర్ సెటైర్లు వేశారు. బయటకు రాములా అన్నట్లు... లోపల రెమోలా ఉంటున్నాడన్నారు. ఒకసారి రాష్ట్రంలో డబ్బులు లేవని రేవంత్ అంటాడని, మరి బడ్జెట్‌లో మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రంగా చూపిస్తున్నారన్నారు. అప్పులు ఎవరూ ఇవ్వడం లేదని, అంటూనే ఇప్పటి వరకు రూ.1.58లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. పదేళ్లలో కేసీఆర్ 4.17లక్షల కోట్లు అప్పు చేస్తే.. కేవలం రెండు మూడేళ్లలో లక్షన్నర కోట్లు కాంగ్రెస్ సర్కార్ అప్పు చేసిందన్నారు. అయితే.. కేసీఆర్ అప్పు చేసినా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బాగు చేశారని, ఇంటింటికి తాగునీరు అందించామన్నారు. మరి కాంగ్రెస్ అప్పులు చేసే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది పనులు చేసిందో చెప్పాలని కేటీఆర్ అన్నారు.