హైదరాబాద్‌లో మారిన ఆర్టీసీ బ‌స్సు రూట్లు.. ఏ నెంబ‌ర్ బ‌స్సు, ఎలా వెళ్తుందంటే.?

Published : Aug 19, 2026, 08:34 AM IST

Hyderabad: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ పరిసరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులు, ట్రాఫిక్ నియంత్రణ కారణంగా కొన్ని ప్రధాన మార్గాల్లో వన్‌వే విధానం అమల్లో ఉంది. దీంతో ఆ మార్గాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సుల రూట్లలో మార్పలు చేశారు.

PREV
14
జూబ్లీహిల్స్ వైపు వెళ్లే బస్సులకు మార్పులు

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన మళ్లింపుల నేపథ్యంలో పలు ఆర్టీసీ సర్వీసులు గతంలో ప్రయాణించిన మార్గాలకు భిన్నంగా నడవనున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిల్మ్ నగర్, పెద్దమ్మ గుడి, రోడ్ నంబర్ 45 ప్రాంతాల్లో బస్సులు వెళ్లే దిశల్లో మార్పులు కనిపిస్తాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లే ముందు బస్సు నంబర్‌తో పాటు అది ఏ మార్గంలో వస్తుందో తెలుసుకోవడం మంచిది. రద్దీని బట్టి అదనపు సర్వీసులు నడిపేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

24
47L రూట్‌లో ఇలా ప్రయాణం

సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళ్లే 47L బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి బేగంపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, నాగార్జున సర్కిల్, టీవీ9 మసీదు, ఎల్‌వీ ప్రసాద్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, ఫిల్మ్ నగర్, దర్గా మీదుగా మణికొండ చేరుతాయి.

మణికొండ నుంచి సికింద్రాబాద్ దిశగా వెళ్లే 47L సర్వీసులు మణికొండ బస్‌స్టాండ్ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి, టీవీ9 మసీదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఆర్‌జే కాలేజీ, పోలీస్ లైన్, ప్లాజా మీదుగా సికింద్రాబాద్ చేరతాయి.

34
10H, 222A సర్వీసుల మార్గాలు ఇవే

సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్లే 10H బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బేగంపేట, మైత్రివనం, యూసఫ్‌గూడ ఎక్స్ రోడ్స్, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరుతాయి. తిరుగు ప్రయాణంలో కొండాపూర్ నుంచి పెద్దమ్మ గుడి, నవయుగ, వెంకటగిరి, యూసఫ్‌గూడ ఎక్స్ రోడ్స్, మైత్రివనం, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ చేరతాయి.

222A రూట్లలో మార్పులు ఇలా..

222A సర్వీసులు కోఠి నుంచి పటాన్‌చెరు దిశగా లకడికపూల్, మసబ్ ట్యాంక్, నాగార్జున సర్కిల్, ఎల్‌వీ ప్రసాద్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్తాయి. పటాన్‌చెరు నుంచి కోఠి వచ్చే సర్వీసులు మాదాపూర్ పీఎస్, పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్, నాగార్జున సర్కిల్, మసబ్ ట్యాంక్, లకడికపూల్ మీదుగా కోఠి చేరతాయి.

44
127K బస్సుల రాకపోకలు ఎలా ఉంటాయి?

కోఠి నుంచి కొండాపూర్ వెళ్లే 127K సర్వీసులు కోఠి బస్‌స్టాండ్ నుంచి లకడికపూల్, మసబ్ ట్యాంక్, పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి, రోడ్ నంబర్ 45, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరతాయి.

కొండాపూర్ నుంచి కోఠి వైపు వచ్చే 127K బస్సులు మాదాపూర్ పోలీస్ స్టేషన్, రోడ్ నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, పెన్షన్ హౌస్, మసబ్ ట్యాంక్ మీదుగా కోఠి చేరతాయి.

ప్రస్తుత ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో బస్సుల ప్రయాణ సమయం మారే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 పరిసరాలకు వెళ్లే వారు బస్సు రూట్, స్టాప్ వివరాలను ముందుగానే పరిశీలించాలి. ట్రాఫిక్ రద్దీ పెరిగిన సందర్భాల్లో అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories