Hyderabad Real Estate: హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికింది. 7.67 ఎకరాల భూమిని MSN రియాల్టీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
Hyderabad Real Estate: రికార్డుల మోత మోగిస్తున్న భూముల ధరలు
తెలంగాణలో భూములు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో భూముల ధరలు కొత్త రికార్డులు నమోదుచేస్తున్నాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూములను ప్రభుత్వం వేలం వేసింది. ఇక్కడ రికార్డు స్థాయికి ధరలు చేరాయి.
టీజీఐఐసీ (TGIIC) నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి విలువ రూ.177 కోట్లుగా పలకడం విశేషం. ఇది దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ లేని అత్యధిక ధర కావడం గమనార్హం. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భూముల ధరలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ (MSN) రియాల్టీ సంస్థ 1,357 కోట్ల రూపాయల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.
24
టీజీఐఐసీ భూముల వేలం ఎలా సాగిందంటే?
వేలం ప్రారంభంలో టీజీఐఐసీ ఎకరాకు రూ.101 కోట్ల ప్రారంభ ధరను ప్రకటించింది. 18.67 ఎకరాలను రెండు పార్సెల్లుగా విభజించి, 11 ఎకరాలను ఒక భాగంగా, 7.67 ఎకరాలను మరొక భాగంగా వేలంలో పెట్టారు. ఈ వేలంలో గోద్రెజ్, సత్వా, హెటిరో, బ్రిగేడ్, మెయిల్, ఫ్రస్టేజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. చివరికి ఎంఎస్ఎన్ రియాల్టీ 7.67 ఎకరాలను రికార్డు బిడ్ తో కొనుగోలు చేసింది.
34
హైదరాబాద్ భూములు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి !
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భూముల ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరం భూమి రూ.100.75 కోట్ల రికార్డు ధర పలికింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే, ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఎఎస్ఎన్ రియాల్టీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములను కొనుగోలు చేసిన సంస్థగా నిలిచింది.
లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ ఎంఎస్ఎన్ రియాల్టీ
ఎంఎస్ఎన్ రియాల్టీ హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే ప్రముఖ సంస్థగా కొనసాగుతోంది. ఇది ఎంఎస్ఎన్ గ్రూప్ నుంచి 2024లో స్థాపించారు. నాణ్యత, డిజైన్, సుస్థిరతపై దృష్టి పెట్టి హై-ఎండ్ అపార్ట్‌మెంట్లను నిర్మించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వన్ బై MSN ప్రాజెక్ట్ నియోపోలిస్‌లో వారి ఫస్ట్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్స్ ప్రాజెక్ట్. ఇందులో విశాలమైన అపార్ట్‌మెంట్లు, ప్రీమియం సౌకర్యాలు, కమ్యూనిటీ హాస్పిటాలిటీ అందుబాటులో ఉంటాయి.