Hyderabad: ఇక హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ అంతా అటు వైపే.. కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం

Published : Apr 17, 2026, 01:25 PM IST

Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న ప్రాంతంగా భావించిన ఉప్పల్, ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందిన రెసిడెన్షియల్ హబ్‌గా మారింది. మెట్రో, ఐటీ కంపెనీలు, రోడ్ల విస్తరణతో ఉప్పల్ నుంచి భువనగిరి వరకు ప్రాంతం ఇంటి కొనుగోలుకు ఆకర్షణీయంగా మారింది. 

PREV
14
మెట్రోతో మారిపోయిన ఉప్పల్ పరిసరాలు

మెట్రో రైలు ఉప్పల్ వరకు రావడం ఈ ప్రాంతానికి పెద్ద ప్లస్ అయింది. ఇప్పటికే రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి, ఉద్యోగులకు ప్రయాణం సులభమైంది, నగరానికి కనెక్టివిటీ పెరిగింది. ఈ కారణాలతో ఉప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉప్ప‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇళ్ల‌ను కొనుగోలు చేస్తున్నారు.

24
పెరుగుతున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులు

ఉప్పల్ నుంచి భువనగిరి వరకు అనేక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ముఖ్యంగా బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, ఘట్‌కేసర్, భువనగిరి వరకు రియ‌ల్ ఎస్టేట్ దూసుకెళ్తోంది. ఇక్కడ అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త‌వి కూడా నిర్మాణం జ‌రుగుతున్నాయి.

34
వెస్ట్ హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువ ధరలు

వెస్ట్ హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తూర్పు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఆఫీసుల‌కు కాస్త దూర‌మైనా మెట్రో అందుబాటులో ఉండ‌డంతో మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ప్ర‌స్తుతం డ‌బుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ రూ. 50 ల‌క్ష‌ల్లో వ‌స్తోంది. నారాప‌ల్లి లాంటి ప్రాంతాల్లో అయితే ఇది మ‌రింత త‌క్కువ‌గా ఉంది.

44
ఐటీ కంపెనీలు, అభివృద్ధి ప్రభావం

ఈ ప్రాంత అభివృద్ధికి ఐటీ కంపెనీలు కూడా కారణంగా చెప్పొచ్చు. పోచారం ప్రాంతంలో ఐటీ హబ్‌లు, ఉప్పల్‌లో ఐటీ SEZలతో ఇక్క‌డ ఇల్ల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇవే కాకుండా అవుటర్ రింగ్ రోడ్, లింక్ రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణం (ఉప్పల్ నుంచి నారపల్లి వరకు) ఇవి అన్నీ కలిసి రియల్ ఎస్టేట్‌కు బూస్ట్ ఇచ్చాయి.

మొత్తం మీద ఉప్పల్ నుంచి భువనగిరి వరకు ప్రాంతం ప్రస్తుతం శాశ్వత నివాసానికి మంచి ఎంపికగా మారుతోంది. సౌకర్యాలు, కనెక్టివిటీ, ధరలు అన్నీ కలిపి చూసుకుంటే ఈ కారిడార్ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటి కొనుగోలు ఆలోచనలో ఉన్నవారికి ఇది సరైన టైమ్‌గా చెప్పవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవలం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణులు సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories