Hyderabad : మీరు ఈ నగరంలో నివసిస్తున్నారా..? అయితే ఈ వాట్సాప్ నంబర్ ను సేవ్ చేసి పెట్టుకొండి

Published : Jul 28, 2025, 10:46 AM ISTUpdated : Jul 28, 2025, 10:51 AM IST

హైదరాబాద్ వాసులకు శుభవార్త. మీ సమస్యల పరిష్కానికి పిర్యాదు చేసేందుకు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ ఫోన్ నుండే వాట్సాప్ ద్వారా ఫిర్యాదుచేయవచ్చు... ఈ వాట్సాప్ నంబర్ ఏదంటే..

PREV
15
ఇక వాట్సాప్ తో మీ సమస్యలు పరిష్కారం

Hyderabad : పరిపాలనకు టెక్నాలజీని జోడిస్తే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఇప్పటికే పాలకులు, అధికారులు నిరూపిస్తున్నారు... డిజిటల్ ఇండియా వంటి పథకాలు అలాంటివే. తెలంగాణ ప్రభుత్వం కూడా టెక్నాలజీని పాలనతో అనుసంధానం చేసే ప్రయత్నాలు చేస్తోంది... అందులో భాగంగానే వాట్సాప్ సేవలను ప్రారంభించింది... రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ఇందుకోసం ఎంచుకుంది.

DID YOU KNOW ?
వాట్సాప్ లోనే బస్ టికెట్స్ బుక్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అమలుచేస్తోంది. 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రభుత్వ సేవలే కాదు ఏపిఎస్ ఆర్టిసి బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.
25
హైదరాబాదీలు ఈ వాట్సాఫ్ నెంబర్ సేవ్ చేసుకొండి

మీరు హైదరాబాద్ లో నివాసముంటున్నారా? అయితే ఈ వాట్సాప్ నెంబర్ 7416687878 ను సేవ్ చేసుకోండి. ఇకపై మీకు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి సమస్య ఎదురైనా ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసి వెంటనే పరిష్కారం పొందవచ్చు. ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ వాట్సాప్ గ్రీవెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్లు దాసరి హరిచందన తెలిపారు.

ఇకపై హైదరాబాద్ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నమాట. ఈ నెంబర్ కు మీ సమస్యను తెలుపుతూ పిర్యాదు చేస్తేచాలు దాన్ని సంబంధిత డిపార్ట్ మెంట్ కు పంపిస్తారు. అంతేకాదు మీ ఫిర్యాదుకు ఓ ఐడీని కేటాయిస్తారు... దీనిద్వారా మీ పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చు.  ఇందుకోసం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) అందిస్తారు.

ఇలా వాట్సాప్ గ్రీవెన్స్ అందుబాటులోకి రావడంవల్ల కేవలం ఫోన్ నుండే ఫిర్యాదులు చేయవచ్చు... దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగ, బిజినెస్ పనుల్లో బిజీగా ఉండేవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే లంచాల సమస్య కూడా ఉండదు... పారదర్శకంగా, తొందరగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజావాణి వంటి కార్యక్రమాలకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుతుంది... తద్వారా అధికారులపై పనిఒత్తిడి ఉండదు. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లోనే తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వడం చాలామంచి చర్యగా హైదరాబాద్ ప్రజలు పేర్కొంటున్నారు.

35
వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపులు

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ఆస్తిపన్ను చెల్లింపుల కోసం ఉపయోగిస్తోంది. మీ ఆస్తిపన్ను వివరాల గురించి తెలుసుకోవాలంటే 9000253342 ఫోన్ నంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... వివరాలన్ని వచ్చేస్తాయి. మీ ఇంటి నంబర్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PTIN)వివరాలు అందిస్తే వివరాలన్ని వచ్చేస్తాయి... దాని ఆధారంగా ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వివరాలు తెలుసుకునే అవసరం లేకుండా మీ ఫోన్ నుండే ఆస్తిపన్ను బకాయిల గురించి తెలుసుకోవచ్చు... ఇదే ఫోన్ నుండి ఇంటివద్ద కూర్చుని ట్యాక్స్ చెల్లించి నిశ్చింతగా ఉండొచ్చు.

45
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కూడా వాట్సాప్

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యల పరిష్కారానికి కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తోంది. ఫోన్ నెంబర్ 7901628343 కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి... అందులో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 'రిజిస్టర్ కంప్లైంట్', ఇప్పటికే మీరు చేసిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలంటే 'ట్రాక్ కంప్లైంట్', మరేదైనా సమస్య ఉంటే 'చాట్ విత్ ఏజెంట్' ఎంచుకోవాలి. ఇలా ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా మీ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఈ వాట్సాప్ ను పాలన కోసం ఉపయోగిస్తోంది...ఇందుకోసమే వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా రాష్ట్ర పౌరులకు ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను అందిస్తోంది. సర్టిఫికేట్లు ఇతర పత్రాలు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పిస్తోంది. ఇలా ఇప్పటికే 161 రకాల సేవలను అందిస్తోంది ప్రభుత్వం... భవిష్యత్ లో వీటిని 520కి పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories