Hyderabad: హైదరాబాద్ బెస్ట్ అంటున్న బెంగళూరు టెకీ.. ట్రాఫిక్‌కు గుడ్‌బై చెబుతూ వైరల్ పోస్ట్ !

Published : Jul 16, 2025, 06:30 AM IST

Hyderabad better than Bengaluru: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిన ఓ యువకుడు హైదరాబాద్‌కు మారుతున్నానని ప్రకటించడంతో నగర జీవన ప్రమాణాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అతని పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

PREV
16
ఇదెక్కడి ట్రాఫిక్ రా బాబు.. సగం టైమ్ బెంగళూరు రోడ్డుపైనే !

ఇదెక్కడి ట్రాఫిక్ రా బాబు.. సగం టైట్  బెంగళూరు రోడ్డుపైనే పోతోంది.. నేను హైదరాబాద్‌కు పోతున్నా.. అంటూ బెంగళూరు ట్రాఫిక్ తో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీసింది. ఈ ట్వీట్ హైదరాబాదును మరోసారి ‘లివబుల్ సిటీ’గా ప్రస్తావనకు తెచ్చింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
ట్రాఫిక్ భయంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్

ఒక ఎక్స్ యూజర్ బుధవారం ఉదయం ఒక ట్వీట్ చేశాడు. "ఇప్పటివరకు 40 నిమిషాలు పట్టే నా ఆఫీస్ ట్రిప్, నిర్మాణ పనుల వల్ల మారిన రూట్‌లతో 1 గంట 50 నిమిషాలైంది. ఇక బెంగళూరుకు గుడ్‌బై... వచ్చే ఏడాది హైదరాబాద్‌కు మారిపోతా!" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

36
హైదరాబాదుపై పెరుగుతున్న ఆకర్షణ

తన పోస్టులో "హైదరాబాద్‌లో మూడు నెలలే వేడి. మిగతా మాసాల్లో బెంగళూరుతో సమానమైన వాతావరణం ఉంటుంది" అని పేర్కొనడం హైదరాబాదును నివాస పరిస్థితులను హైలెట్ చేశారు. ట్రాఫిక్‌తో పాటు శుభ్రత, నగర నిర్మాణం వంటి అంశాల్లో హైదరాబాద్ బెంగళూరును మించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

అలాగే, ఆ వ్యక్తి పోస్ట్‌లో తన అభిప్రాయాన్ని మరింత పంచుకుంటూ.. “ఐదుగురు కూర్చొనే కారులో ఒక్కరే ప్రయాణించడం కూడా ట్రాఫిక్ పెరగడానికి కారణం. నేను బైక్‌ను ప్రిఫర్ చేస్తాను, ట్రీప్‌కు ముగ్గురు లేదా నలుగురు ఉంటేనే కారు డ్రైవ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ట్రాఫిక్‌కి కొంత ఉపశమనం దొరుకుతుందని" పేర్కొన్నాడు.

ఉబెర్ డ్రైవర్ గా టెకీ

అతను చివరిగా పేర్కొన్న ఒక ఆసక్తికర విషయం.. "నా ఉబెర్ డ్రైవర్ నన్ను రిఫరల్ అడిగాడు. అతను పూర్తి సమయం డేటా ఇంజనీర్‌ (TCS) కాగా, పార్ట్‌టైమ్ ఉబెర్ డ్రైవర్‌గానూ పని చేస్తున్నాడు." ఈ వ్యాఖ్య మరో కోణంలో నగర జీవన శైలిని ప్రతిబింబిస్తుంది.

46
సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం

ఈ ట్వీట్‌పై వందలాది మంది స్పందించారు. ఓ యూజర్ రాసారు, "హైదరాబాద్‌కు వలస వెళ్లే వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. బెంగళూరులో ఉదయం ప్రయాణం అంటే ఒక యుద్ధమే!"

మరొకరు.. "ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హైదరాబాద్ చాలా స్ట్రాంగ్. వెస్ట్ హైదరాబాద్ కాస్త ఖరీదైనదే అయినా, రోజువారి జీవితానికి సౌకర్యవంతంగా ఉంటుంది" అని పేర్కొన్నాడు.

56
హైదరాబాదులో మెరుగ్గా జీవన ప్రమాణాలు

హైదరాబాద్ నగరం గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, రోడ్లు, మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్లు వంటి అంశాల్లో మెరుగుదల సాధించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో, రోడ్డు నెట్‌వర్క్ ద్వారా సాధ్యమైన స్థాయిలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. దీంతో నగర ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలపై ఆధారపడకుండానే జీవించగలుగుతున్నారు.

ఇందుకు భిన్నంగా, బెంగళూరులో పరిస్థితి మరింత కష్టతరంగా మారుతోంది. ఇరుకైన రోడ్లు, పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిరంతర డైవర్షన్లతో ప్రజలు రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు.

66
హైదరాబాదు... ఫ్యూచర్ సిటీ

హైదరాబాదు సాధిస్తున్న అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ అందించగల సౌకర్యాలు యువతను ఆకర్షిస్తున్నాయి. "ఒక రోజు వారం అంతా పని చేసి, వీకెండ్‌లో షార్ట్ ట్రిప్ కోసం బెంగళూరు బాగుంది కానీ, డే టూ డే లైఫ్ కోసం హైదరాబాద్ బెస్ట్!" అంటూ ఓ యూజర్ పేర్కొన్నాడు. అంటే ఎంత టెక్ సిటీ అయినా.. తమ మౌలిక వసతులను మరింత మెరుగు పర్చకపోతే యువత కొత్త నగరాలవైపు వెళ్తారనే విషయాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories