5 గంట‌ల్లో హైద‌రాబాద్ టూ బెంగ‌ళూరు.. రూ. 13 వేల కోట్ల‌కి పైగా ఖ‌ర్చుతో క‌ళ్లు చెదిరే నిర్మాణం

Published : Nov 22, 2025, 05:17 PM IST

Hyderabad: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రూట్‌ ప్రస్తుతం ఉన్న NH-44 రహదారికి సమాంతరంగా ఉండనుంది. 

PREV
14
5 గంటల్లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు

ప్రస్తుతం NH-44 మీద ప్రయాణిస్తే రెండు నగరాల మధ్య దూరం కవర్‌ చేయడానికి సాధారణంగా 8 నుంచి 9 గంటలు పడుతోంది. కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ పూర్తైతే కేవలం 5 గంటల్లో బెంగళూరుకు చేరుకోవచ్చు. ఈ హైవేను గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం తక్కువగా ఉండేందుకు లిమిటెడ్‌ యాక్సెస్‌ ఫీచర్లు అమలు చేస్తారు.

24
ఆరు వరుసల కొత్త కారిడార్‌

మొదట NH-44ను ఆరుగాని, ఎనిమిది వరుసలకుగాని విస్తరించాలనే ఆలోచన ఉన్నా, రూట్‌లో ఉన్న నగరాలు, నివాసాలు, వ్యాపార ప్రాంతాల కారణంగా భూమి సేకరణ కష్టతరమైంది. అందుకే పూర్తిగా కొత్తగా ఆరు వరుసల సమాంతర కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 

ప్ర‌స్తుతం NH-44 తెలంగాణ‌లో 210 కిలోమీట‌ర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 260 కి.మీలు, కర్ణాటకలో 106 కి.మీలు ఉంది. మొత్తం 576 కి.మీలు ఉంది. కొత్త కారిడార్‌ కూడా ఇదే దూరం పరిధిలో కానీ, NH-44కు 10–15 కి.మీ. దూరంలో సాగుతుంది.

34
ఆధునిక ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ

ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా లిమిటెడ్ ఎంట్రీ–లిమిటెడ్ ఎగ్జిట్ విధానంలో ఉండనుంది. కొన్ని ప్రత్యేక జంక్షన్ల వద్ద మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ ఇస్తారు. ఇతర జాతీయ రహదారులు లేదా ముఖ్య రూట్లు ఈ కారిడార్‌ను తాకే చోట్ల ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌లు నిర్మిస్తారు. కారిడార్‌ మొత్తం ఎత్తు 4–5 మీటర్లు ఉండి, దానిపై ఆధునిక సాంకేతికతతో ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ATMS) అమలు చేస్తారు.

44
ఎంత ఖ‌ర్చు చేయ‌నున్నారంటే..

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సలహా సంస్థ మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేస్తోంది. వాటిలో ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత తుది బడ్జెట్‌ ఖరారవుతుంది. ప్రారంభ అంచనాలు 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేప‌ట్ట‌నున్నారు. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిధిలోనే రూ. 13,000 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. కేంద్ర రహదారి సంస్థ NHAI ఫిబ్రవరి నాటికి Detailed Project Report (DPR) సమర్పించాలంటూ డెడ్‌లైన్‌ ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories