Huzurabad Bypoll: ఆత్మగౌరవం కాదు... ఆస్తుల పంచాయితీతోనే ఈ ఉపఎన్నిక: బల్మూరి వెంకట్

First Published Oct 17, 2021, 1:01 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఇంటింటి ప్రచారాన్ని ప్రాారంభించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలు ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నికలు కావని... కేవలం అహంకారం, ఆస్తుల పంచాయితీతో వచ్చిన ఎన్నికలని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కమలాపూర్ మండలంలోని బత్తివానిపల్లి, గోపాలపురం గ్రామాల్లో వెంకట్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 
 

ఈ సందర్భంలో balmoor venkat మాట్లాడుతూ... గతంలో huzurabad నుండి trs ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న eatala rajender ఇప్పుడు BJP తరపున పోటీ చేస్తున్నారని గుర్తుచేసారు. కీలకమైన మంత్రి పదవిలో వుండి కూడా తనను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ఈటల చేసింది ఏమీ లేదని వెంకట్ మండిపడ్డారు. 


''కరోనా సమయంలో హుజురాబాద్ ప్రజలను పట్టించుకోని ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు అహంకారంతో, ఆస్తుల పంచాయతీతో వచ్చిన ఎన్నికలు...అంతేగానీ ఆత్మగౌరవ ఎన్నికలు కావు'' అని బల్మూరి ఎద్దేవా చేసారు. 

READ MORE  Huzurabad bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

''టీఆర్ఎస్ పాలనలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు కానీ గొర్లు, బర్లు కాసుకునే పరిస్థితి మాత్రం వచ్చింది. మనం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది ఇలా గొర్లు, బర్లు కాసుకోవడానికేనా?'' అని ఆవేధన వ్యక్తం చేసారు. 
 

''ఈ TRS ప్రభుత్వం రుణమాఫీ మరిచిపోయింది...డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు ఇవ్వడం మరిచింది. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం మరిచింది.  కాబట్టి ప్రజలు, నిరుద్యోగుల పక్షాన నిలబడి  అసెంబ్లీలో ఒక గొంతుకగా  పోరాడటానికి ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి'' అని బల్మూరి వెంకట్ ప్రజలను కోరారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్, బిజెపి జోరుగా ప్రచారంచేస్తుంటే... కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. ఆ పార్టీ అభ్యర్థిగా వెంకట్ ను ప్రకటించిన తర్వాత ప్రచారంలో ఊపు పెరుగుతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం హుజురాబాద్ లోవైపే చూడటం లేదు.
 


వెంకట్ నామినేషన్ వేసిన రోజు కాంగ్రెస్ లో కాస్త ఊపు కనిపించింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసివెళ్లి వెంకట్ నామినేషన్ వేసారు. ఆ తర్వాత టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో హుజురాబాద్ కు విచ్చేసి వెంకట్ తరపున ప్రచారం నిర్వహించారు. 

Huzurabad Bypoll: కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ (వీడియో)

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనే సీనియర్లు హుజురాబాద్ లో కరువయ్యారు. దీంతో ఎవరినో నమ్ముకుంటే లాభం లేదని భావించారో ఏమో వెంకట్ రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం చేపట్టారు. తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు. 
 

click me!