Success Story : మారుమూల పల్లెటూరి నుండి బిలియనీర్ వరకు.. ఆయన కారు నెంబర్ ప్లేటే రూ.25 లక్షలు.. ఇదికదా సక్సెస్

Published : Sep 13, 2025, 05:43 PM IST

Success Story : మారుమూల తెలంగాణ పల్లెటూళ్లో పుట్టినవ్యక్తి ఇప్పుడు భారతదేశంలోనే టాప్ 100 ధనవంతుల్లో ఒకరు. తాజాగా ఆయన రూ.25,00,000 పెట్టి తన కారుకు ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. ఇంతకూ ఆయన ఎవరో… ఆ సక్సెస్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.   

PREV
15
ఈయనది కదా సక్సెస్ అంటే..

Success Story : ''కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహాపురుషులవుతారు'' అని ఓ తెలుగు సినిమాపాటలోని లిరిక్స్ ఆయన నిలువెత్తు నిదర్శనం. 'పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు'' అనడానికి ఆయన జీవితమే సాక్ష్యం. ఓ మారుమూల పల్లెటూరిలో... ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన వ్యక్తి ఇప్పుడు దేశంలోనే టాప్ 100 ధనవంతుల్లో ఒకరు. చిన్నప్పుడు అంబాసిడర్ కారును చూసి చప్పట్లు కొడుతూ గంతులేసి మురిసిన కుర్రాడు... ఇప్పుడు కారు కాదు దాని నంబర్ ప్లేటుకే 25,00,000 రూపాయలు ఖర్చు చేశారు. ఆయన ఎవరో కాదు... మన తెలుగు బిడ్డ, ప్రముఖ వ్యాపారవేత్త బండి పార్థసారథి రెడ్డి.

25
కారు నంబర్ ప్లేటే రూ.25 లక్షలా..!

తెలుగు ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా హెటిరో ఫార్మా అందరికీ సుపరిచితమే. దేశంలో ఇప్పుడు అనేక జబ్బులకు వాడుతున్న మెడిసిన్స్ లో చాలావరకు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసినవే. ప్రపంచంలోనే యాంటి రెట్రోవైరల్ ఔషధాలను తయారుచేసే అతిపెద్ద కంపెనీ ఈ హెటిరో దీని వ్యవస్థాపకులే బండి పార్థసారథి రెడ్డి.

ఇటీవల హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టివో కార్యాలయం కొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలంపాట వేసింది. ఇందులో 'TG 09 G 9999' నెంబర్ ను ఈ హెటిరో సంస్థ యాజమాన్యం కొనుగోలుచేసింది... ఈ నంబర్ కోసం ఎంత ఖర్చుచేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 25,50,200 రూపాయలకు ఈ నెంబర్ ను సొంతం చేసుకున్నారు పార్థసారథి రెడ్డి... అంటే దాదాపు మంచి కారు ధరను కేవలం నంబర్ ప్లేటుకే పెట్టారు.

డబ్బులు నీళ్లలా ఖర్చుచేస్తున్నారు... పెద్దలు సంపాదించిన ఆస్తులతో జల్సాలు చేస్తున్నారని అనుకుంటే పొరపడినట్లే. పార్థసారథి రెడ్డి ఓ మారుమమూల పల్లెటూళ్లో పుట్టిపెరిగి ఎంతో కష్టపడి బిలియనీర్ స్థాయికి వచ్చారు. ఆయన సక్సెస్ స్టోరీ నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. ఎక్కడ పుట్టాం... ఎక్కడ చదివామన్నది కాదు... ఎలా కష్టపడ్డాం... ఏం సాధించామన్నదే ముఖ్యమని నిరూపించారు బండి పార్థసారథి రెడ్డి.

35
పార్థసారథి రెడ్డి సక్సెస్ స్టోరీ

ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మారుమూల గ్రామం కందుకూరు. అక్కడ నివసించే శ్రీనివాసరెడ్డి, సోమకాంతమ్మ దంపతులకు మార్చి 6, 1954 లో జన్మించాడు పార్థసారథి రెడ్డి. అతడి చిన్నతనమంతా ఆ గ్రామంలోనే గడిచింది... ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడక్కడే సాగింది.

ఆయన ఉన్నత విద్యాబ్యాసమంతా ప్రభుత్వ కాలేజీల్లోనే సాగింది... ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జెవిఆర్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేశారు. తర్వాత పిజి కోసం హైదరాబాద్ వచ్చారు... ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. అనంతరం ఇదే యూనివర్సిటీలో పిహెచ్డి కూడా పూర్తిచేశారు.

45
చదువుకుంటూనే హెటిరో సంస్థ ప్రారంభం

ఇలా చదువుకుంటున్న సమయంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు పార్థసారథి రెడ్డి. ఈ సమయంలోనే ఎవరిదగ్గరో పనిచేయడం ఎందుకు... మనమే ఓ కంపెనీ నడిపించలేమా అనే ఆలోచన వచ్చింది. అందులోంచి పుట్టిందే హెటిరో సంస్థ. పార్థసారథి రెడ్డి ఎంతో కష్టపడి ఒకరిద్దరితో ప్రారంభమైన కంపెనీని దాదాపు 10 వేల మంది ఉద్యోగులు కలిగిన మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇలా పల్లెటూరి నుండి చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చిన వ్యక్తి బిలియనీర్ గా మారారు… దేశంలోని ఫార్మా రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు.

55
దేశంలోనే టాప్ 100 రిచ్చెస్ట్ పర్సన్స్ జాబితాలో పార్థసారథిరెడ్డి

హెటిరో సక్సెస్ తర్వాత పార్థసారథి రెడ్డి వెనక్కి తిరిగి చూడలేదు... ఆయన దేశమే గర్వించదగ్గ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇలా ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 100 లో... తెలుగు రాష్ట్రాలకు చెందినవారిలో అయితే టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. పార్థసారథి రెడ్డి హెటిరో తో పాటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు... అలాగే ఇటీవలే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

పార్థసారథి రెడ్డి రూ.3,900 కోట్లకు పైగా ఆస్తులను కలిగివున్నట్లు స్వయంగా తన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పేర్కొన్నారు. ఇలా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కాదు అత్యంత ధనిక ఎంపీగా మారారు. ఇక ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తులను కలిపితే రూ.5,300 కోట్లకు చేరుతుంది. ఇలా పల్లెటూళ్లో పుట్టిపెరిగిన వ్యక్తి వేలకోట్లు ఆస్తలను సంపాదించారు... దేశంలోనే సంపన్నుడిగా మారారు.

Read more Photos on
click me!

Recommended Stories