Published : Jul 04, 2025, 08:06 AM ISTUpdated : Jul 04, 2025, 08:43 AM IST
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వానలు జోరందుకున్నాయి. ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు జారీ చేశారు? ఇక్కడ తెలుసుకుందాం.
Telugu States Weather Update : నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి వంటివి ఏర్ఫడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నాలుగైదు రోజులుగా వానలు జోరందుకున్నాయి.
గత నెల జూన్ లో లోటు వర్షపాతం ఉండటంతో ఆందోళనకు గురయిన తెలుగు ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. జులై మొత్తం వర్షాలుంటాయని... జూన్ లోని లోటును కూడా తీర్చేస్థాయిలో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. చెబుతున్నట్లుగానే ఈ నాలుగు రోజులుగా వర్షాలు బాగానే పడుతున్నాయి.
25
నేడు తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఇవాళ (జూన్ 4, శుక్రవారం) మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక నిజామాబాద్. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
35
హైదరాబాద్ లో చిరుజల్లులు
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (శుక్రవారం, జులై 4) జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
55
తెలుగు ప్రజలు జాగ్రత్త
వర్ష సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచించింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇప్పటికే తొలకరి వానల సమయంలోనే కొందరు విత్తనాలు విత్తుకోగా మరికొందరు ఈ వర్షాలు జోరందుకున్నాక ఆ పని చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా వర్షాలు మొదలవడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.