Rain Alert: బీ అల‌ర్ట్‌.. వ‌చ్చే మూడు రోజులు వాన‌లే వాన‌లు. ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.

Published : Jul 06, 2025, 07:34 AM IST

జూన్ నెల‌లో మొహం చాటేసిన వ‌రుణుడు జూలైలో మాత్రం క‌రుణిస్తున్నాడు. నెల ప్రారంభ‌మైన వెంట‌నే ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రానున్న మూడు రోజులు తెలంగాణ‌లో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 

PREV
15
ఛత్తీస్‌గఢ్‌పై బలమైన సుడిగుండం..

ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన బలమైన సుడిగుండం ప్రభావం వ‌ల్ల‌ ఉత్తర తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారాయి. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, జయశంకర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావార‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంది.

25
నైరుతి రుతుపవనాల బలంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు బలపడటం కూడా ఈ వర్షాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి తెలంగాణ మీదుగా ప్రయాణించడంతో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 7వ తేదీన వర్షపాతం అత్యధికంగా ఉండనుందని అంచనా.

35
20కు పైగా జిల్లాల్లో వర్ష సూచనలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

45
గాలులు, పిడుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అరేబియా సముద్రం ప్రాంతంలో గంటకు 52 కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా, తెలంగాణలో గంటకు 23 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు బయట తిరగకుండా, సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాల‌ని సూచిస్తున్నారు.

55
లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు, అధికారుల సూచనలు

వర్షాల తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనీ, ప్రభుత్వ సూచనలు పాటించాలనీ వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు వంటి వాటి వద్ద నిల్చోవద్దని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories