తెలంగాణలో బుధ, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు గంటకు 40–50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 17న ఉత్తర తెలంగాణలో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.