Hyderabad: పారిస్, లండన్‌లను మించేలా.. హైదరాబాద్ మూసి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు

Published : Aug 13, 2025, 04:05 PM IST

Hyderabad Musi Riverfront project : హైదరాబాద్ మూసి రివర్‌ఫ్రంట్ పునరుద్ధరణకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) రూ. 4,100 కోట్లు ఫండింగ్ అందించనుంది. ప్ర‌పంచ టాప్ సిటీల‌ను మించేలా మూసి రివర్‌ఫ్రంట్ పునరుద్ధరణ ప‌నులు పూర్తి చేయనున్నారు. 

PREV
16
హైదరాబాద్ మూసి రివర్‌ఫ్రంట్ పునరుద్ధరణకు ఏడీబీ ఆర్థిక సాయం

హైదరాబాద్ మూసి రివర్‌ఫ్రంట్ పునరుద్ధరణకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) రూ. 4,100 కోట్లు ఆర్థిక సహాయం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ నిధులు ఒకేసారి కాకుండా ప‌లు దశల్లో విడుదల చేయ‌నుంది. ఏడీబీ మిషన్ టీమ్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వ అధికారులతో సమావేశమై ప్రాజెక్ట్ అంశాలు, అమలు చేసే చ‌ర్య‌లు, స‌మ‌యం, దశల వారీ నిధుల విడుదల పై చర్చలు జ‌రిపింది.

DID YOU KNOW ?
హైదరాబాద్ కు తాగునీరు అందించే మూసీ ప్రాజెక్టులు
మూసి నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్ (1920), హిమాయత్ సాగర్ (1927) రిజర్వాయర్లు దశాబ్దాల పాటు హైదరాబాద్‌కు ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి వాటా తగ్గి, నగరం గోదావరి, కృష్ణా జలాలపై ఆధారపడుతోంది.
26
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ముఖ్య భాగాలు

ఏడీబీ అందించే ఈ రుణం ప్రధానంగా మూసి నది తీరంలో రోడ్ల నిర్మాణం, డ్రెయిన్‌లు, నాళాల నుండి మురుగునీటిని మళ్లించడానికి ట్రంక్, ఇంటర్‌సెప్టర్ నెట్‌వర్క్‌లు, కొత్త వంతెనల నిర్మాణం వంటి కీలక మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించనున్నారు. 

గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం, మురుగు నీటిని నదిలోకి ప్రవేశించకముందే శుభ్రం చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (STPs) మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే.

36
మూసి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ ఆర్థిక నేపథ్యం

అంతర్జాతీయ నిధుల కోసం ప్రయత్నాలు సెప్టెంబర్ 2024 లో ప్రారంభమయ్యాయి. మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) రూ. 5,863 కోట్ల ప్రాథమిక ప్రాజెక్ట్ రిపోర్ట్ (PPR)ను ఆర్థిక వ్యవహారాల విభాగానికి సమర్పించింది. సాంకేతిక మూల్యాంకనాల అనంతరం, డీఈఏ స్క్రీనింగ్ కమిటీ రెండు నెలల క్రితం ప్రాజెక్ట్ ఆమోదం ఇచ్చింది. 

ఇప్పుడు రుణ ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సేకరించాలని చూసింది. కానీ, కేంద్రం ఏడీబీ నుంచి తీసుకోవాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

46
మూసి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 1 ల‌క్ష కోట్ల‌కు పైనే

మూసి పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం రూ.1 లక్ష కోట్లు పైగా ఖర్చవుతుందని అంచనా. ఏడీబీ నిధులు ప్రాజెక్ట్ కీలక భాగాలను మాత్రమే కవర్ చేస్తాయి. మిగతా ఖర్చులు రాష్ట్ర నిధులు, ఇతర విదేశీ సహాయం లేదా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మార్గం ద్వారా భ‌రించ‌డానికి ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. పీపీపీ మార్గంలో ప్రధానంగా వినోద సదుపాయాల నిర్మాణానికి ఉపయోగించనున్నార‌ని స‌మాచారం.

56
MRDCL కు సిగ్నేచర్ ప్రాజెక్ట్‌లు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే MRDCL కు సిగ్నేచర్ ప్రాజెక్ట్‌లు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఐకానిక్ టవర్, హైదరాబాద్ గేట్వే కోసం టెండర్లను ఆహ్వానించాలని సూచించారు. పూర్తి ప్రాజెక్ట్ బ్లూప్రింట్.. విస్తీర్ణం, సమయాలు, అమలులో ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. వచ్చే కొన్ని నెలల్లో రూపొందించ‌నున్నారు. ఇది హైదరాబాద్‌లో అతిపెద్ద నగర మార్పు ప్రయత్నాలలో ఒకటి కానుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

66
గేట్‌వే ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మాణం కోసం ప్ర‌భుత్వ ప్రణాళిక‌లు

తెలంగాణ ప్రభుత్వం హిమాయత్‌సాగర్ వద్ద గాంధీ సరోవర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై గేట్‌వే ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మించాలని యోచిస్తోంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం పునరుద్ధరించాలని యోచిస్తున్న మూసీ నది ప్రారంభానికి గుర్తుగా ఈ గేట్‌వేను ప్లాన్ చేశారు.

లండన్‌లోని థేమ్స్ నదిని పోలి ఉండేలా మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రకటించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడుతోంది. హైదరాబాద్ వరద సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుంద‌నే ప్ర‌చారం కూడా ఉంది. హైదరాబాద్ పట్టణాభివృద్ధికి చిహ్నంగా భారీ 'ఐకానిక్ టవర్'ను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు స‌మాచారం.

Read more Photos on
click me!

Recommended Stories