గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం..ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం అంటే..

First Published | Sep 5, 2023, 11:39 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం భయాందోళనలు కలిగిస్తోంది. పలు ప్రాంతాల్లో 10 సెం.మీ.లు మించి వర్షపాతం నమోదయ్యింది. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యమధ్యలో కాస్త తెరపిస్తూనే కుండపోతగా కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఇలాగే కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రాంతాల వారీగా కురిసి వర్షపాతం వివరాలు చూస్తే... 


మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం..

కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు..

శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు..

గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్లు..

బోరబండ లో 12.5 సెంటీమీటర్లు..

జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్..

షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు..

కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు..

మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు..

సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు..

బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు..

ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు..

గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు..

మలక్పేట్ లో 9.4 సెంటీమీటర్లు..

ఫలక్నుమాలో 9.2 సెంటీమీటర్లు..

కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు..

సరూర్నగర్ లో 7.9 సెంటీమీటర్లు..

ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు..

మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలు బస్తీల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది.  లింగంపల్లి అండర్పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు నిలబడడంతో, రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 

పలు ప్రాంతాల్లో వరద నీటితో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వరద నీరు చేరుతుండడంతో ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేశారు. రెండు గేట్లు ఎత్తి ముసి లోకి 442 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 

Latest Videos

click me!