ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

First Published | Sep 3, 2023, 3:36 PM IST

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం.  ఈ నెల మొదటి వారంలో  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

 మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు రంగం సిద్దం  చేసకుంటున్నారని ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగుతుంది.ఈ నెల  6వ తేదీన  కాంగ్రెస్ లో చేరాలని తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా  ఉన్న తుమ్మల నాగేశ్వరరావు  అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడ  వరుసగా  తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానాలు పంపుతున్నారు. 

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

ఈనెల 6న  కాంగ్రెస్ లో చేరిక  సాధ్యం కాకపోతే  ఈ నెల  10వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల  7వ తేదీన  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు  వెళ్లనున్నారు. దీంతో  ఈ పర్యటనకు ముందే  కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మల నాగేశ్వరరావు  భావిస్తున్నారని సమాచారం.ఈ నెల  6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగుతుంది.


ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  10 అసెంబ్లీ నియోజకవర్గాలకు  చెందిన ఆయన అనుచరులు  తమ్మల నాగేశ్వరరావు  వెంట నడిచేందుకు  సిద్దమయ్యారు. ప్రతి రోజూ తుమ్మల నాగేశ్వరరావుతో  ఆయన  అనుచరులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఖమ్మం జిల్లా నుండి తుమ్మల నాగేశ్వరరావుకు  మంత్రి పదవి దక్కింది.  తెలంగాణ ఏర్పాటు తర్వాత  2014లో  కేసీఆర్ కేబినెట్ లో కూడ ఆయనకు రోడ్లు , భవనాల శాఖ దక్కింది. 

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

గత నెల  21న  కేసీఆర్ ప్రకటించిన   బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో  పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కలేదు.ఇదే స్థానం నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డికి  కేసీఆర్  అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు  రంగం సిద్దం  చేసుకుంటున్నారు.

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు తుమ్మల నాగేశ్వరరావు. 2016లో  మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో  పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో అదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్థి  కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.దీంతో పాలేరులో  తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి వర్గాలుగా బీఆర్ఎస్ చీలిపోయింది. 

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

పాలేరు సీటు దక్కకపోవడంతో  తుమ్మల నాగేశ్వరరావు  అసంతృప్తికి గురయ్యారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నుండి ఆ పార్టీ నేతలు ఆయనను  తమ పార్టీలో చేరాలని ఆహ్వానం పంపారు. ఇప్పటికే  కాంగ్రెస్ తో జరిగిన చర్చల్లో సానుకూలమైన ఫలితం వచ్చిందని ప్రచారం కూడ లేకపోలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ లో చేరికకు తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకుంటున్నారు.  

ముహుర్తం ఖరారు: ఆ రెండు తేదీల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన అనుచరులతో పాటు  తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  గత నాలుగైదు రోజులుగా  కాంగ్రెస్ పార్టీ నేతలు  తుమ్మల నాగేశ్వరరావుతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు  వరుసగా  ఆయనతో భేటీ అయ్యారు.

Latest Videos

click me!