
Government Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం... హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రక్షణ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ (AVANI or AVNL) పరిధిలో పరిచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి అన్ని అర్హతలుండి రక్షణ శాఖలో ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. కాబట్టి ఇందులో ఉద్యోగం పొందేవారు హైదరాబాద్ నుండి కూడా రాకపోకలు సాగించవచ్చు. మంచి సాలరీతో కూడిన ఉద్యోగాలు... అదీ హైదరాబాద్ లోనే... ఇంకేం కావాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి.
తాజా నోటిఫికేషన్ ద్వారా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులేవి? ఎన్ని ఖాళీలున్నాయి? రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం.
1. సినియర్ మేనేజర్ (ఆర్మర్) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
2. జూనియర్ మేనేజర్ (మెకానికల్) (High Frequency) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
3. జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్) (Process of Audit) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
4. జూనియర్ మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) (Network Quality data base Management system) : 02 పోస్ట్స్ (అన్ రిజర్వుడ్)
5. జూనియర్ మేనేజర్ (మెకానికల్) (STD.Cell) : 02 పోస్ట్స్ (అన్ రిజర్వుడ్)
6. జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) (STD.Cell) : 02 పోస్ట్ ( అన్ రిజర్వుడ్)
7. జూనియర్ మేనేజర్ (మెటలర్జీ) (STD.Cell) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
8. జూనియర్ మేనేజర (CAD స్పెషలిస్ట్) (STD.Cell) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
9. జూనియర్ మేనేజర్ (మెకానికల్) (Project) : 04 పోస్టులు (3 అన్ రిజర్వుడ్, 01 ఓబిసి)
10. జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) (Project) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
11. జూనియర్ మేనేజర్ (CAD స్పెషలిస్ట్) ( Project) :01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
12. జూనియర్ మేనేజర్ (మెకానికల్) (Defected Investigation) : 01 పోస్ట్ (అన్ రిజర్వుడ్)
పోస్టులను బట్టి విద్యార్హతలు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి మాత్రం బిఈ/బిటెక్ తో పాటు పిహెచ్డి, పిజి ఉండాలి. మిగతా జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో బీఈ, బిటెక్ చేసివుండాలి.
సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి గరిష్టంగా 45 ఏళ్ల వయసు వరకు అర్హులు. మిగతా జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 21 నుండి 30 ఏళ్లలోపువారు అర్హులు.
అధికారిక వెబ్ సైట్ ddpdoo.gov.in/career నుండి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో ఫిల్ చేయాలి. దీనికి అవసరమైన విద్యా, ఇతర అర్హత పత్రాలను జతచేయాలి. దీన్ని స్పీడ్ పోస్ట్ లో ''The Deputy General Manager/HR, Ordnance Factory Medak, Yeddumailaram, Dist:Sangareddy, Telangana – 502205'' అడ్రస్ కు పంపించాలి.
నోటిఫికేషన్ వెలువడిన నాటినుండి 21 రోజుల్లో మీ అప్లికేషన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అడ్రస్ కు చేరేలా ప్లాన్ చేసుకొండి. అంటే నవంబర్ 28 వరకు దరఖాస్తు ఫామ్ చేరాలి... ఆ తర్వాత వచ్చే అప్లికేషన్స్ ని పరిగణలోకి తీసుకోరు.
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసే జనరల్ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలాంటా రాతపరీక్ష ఉండదు. కేవలం మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
సీనియర్ మేనేజర్ : నెలకు రూ.70,000 జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి
జూనియర్ మేనేజర్ నెలకు రూ.30,000 జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
గమనిక : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భర్తీచేస్తున్న ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ వే. అంటే నిర్ణీత కాలానికి మాత్రమే ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత సమాచారం కోసం gm.ofmk@ord.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా 040-23283455 కు గాని 040-23283469 నంబర్లకు గానీ ఫోన్ చేయవచ్చు. ( టైమింగ్స్ : 8.00 AM నుండి 05.00 PM (సోమవారం నుండి శుక్రవారం వరకు)