జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

First Published May 29, 2023, 4:05 PM IST

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు జూన్ మొదటివారంలో  న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.  కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  జూపల్లి కృష్ణారావు  మొగ్గు చూపతున్నారని  ప్రచారం సాగుతుంది.  

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  జూన్ మొదటి వారంలో  న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.  కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  జూపల్లి  కృష్ణారావు మొగ్గుచూపుతున్నారనే  ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ అగ్రనేతలతో  చర్చల కోసం  జూపల్లి కృష్ణారావు  ఢిల్లీ వెళ్లనున్నారని   సమాచారం.  జూపల్లి కృష్ణారావు  ఢిల్లీ పర్యటన తర్వాత  కాంగ్రెస్ పార్టీలో  చేరికపై  మరింత  స్పష్టత  వచ్చే అవకాశం ఉందని  తెలుస్తుంది

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

brs flagఈ ఏడాది  ఏప్రిల్  10వ తేదీన  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై  బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతకుముందు  ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డితో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  పాల్గొన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనం ముగిసన  మరునాడే  వీరిద్దరిపై  బీఆర్ఎస్ నాయకత్వం  సస్పెన్షన్ వేటు వేసింది. 

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

ponguleti -jupఈ ఇద్దరు  నేతలతో  కాంగ్రెస్, బీజేపీ నేతలు  టచ్ లోకి వెళ్లారు. తమ  పార్టీల్లో  చేరాలని  రెండు పార్టీల నుండి  ఆహ్వానాలు అందాయి.  కానీ  ఈ ఇద్దరూ కూడా  ఏ పార్టీలో  చేరే విషయమై  స్పష్టత ఇవ్వలేదు.  జూపల్లి కృష్ణారావు  ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  సుదీర్ఘ కాలం పాటు  కాంగ్రెస్ లో  ఉన్నారు.  కొల్లాపూర్ అసెంబ్లీ  నియోజకవర్గం నుండి  కాంగ్రెస్, ఇండిపెండెంట్,  బీఆర్ఎస్  అభ్యర్ధిగా  పోటీ  చేసి విజయం సాధించారు. ally

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మంత్రి పదవికి  రాజీనామా  చేసి జూపల్లి  కృష్ణారావు  తెలంగాణ కోసం  పాదయాత్ర  నిర్వహించారు.  ఆ తర్వాత  ఆయన బీఆర్ఎస్ లో  చేరారు.  2012లో  జరిగిన  ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ (అప్పటి  టీఆర్ఎస్)  అభ్యర్ధిగా   విజయం సాధించారు.  2014 లో  కేసీఆర్ మంత్రివర్గంలో  జూపల్లి కృష్ణారావుకు  స్థానం దక్కింది.  2018  ఎన్నికల్లో  కొల్లాపూర్ నుండి  మరోసారి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  జూపల్లి కృష్ణారావు  పోటీ  చేసి   కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి  చేతిలో ఓటమి పాలయ్యాడు.

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?


బీరం హర్షవర్ధన్ రెడ్డి  ఆ తర్వాత  బీఆర్ఎస్ లో  చేరారు. దరిమిలా  కొల్లాపూర్ లో  బీరం హర్షవర్ధన్ రెడ్డి ,  జూపల్లి కృష్ణారావు  వర్గాల మధ్య పోరు మొదలైంది.     రెండు వర్గాల మధ్య  సయోధ్య కోసం  పార్టీ నాయకత్వం  ప్రయత్నాలు  చేసింది. అయినా కూడా పరిస్థితుల్లో మార్పులు రాలేదు.  ఆత్మీయ సమ్మేళనాలతో  పార్టీ  వ్యతిరేక కార్యక్రమాలకు  పాల్పడుతున్న  జూపల్లి కృష్ణారావుపై  పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత  అనుచరులతో  జూపల్లి కృష్ణారావు  సమావేశాలు  నిర్వహించారు.   బీజేపీలో  చేరాలని జిల్లాకు  చెందిన మాజీ మంత్రి  డీకే  అరుణ,  మాజీ ఎంపీ  ఏపీ జితేందర్ రెడ్డిలు కూడా  జూపల్లి కృష్ణారావును ఆహ్వానించారు.  
 

జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీలో  చేరుతారనే  ప్రచారం సాగుతుంది. ఈ విషయమై  ఆ పార్టీ అగ్రనేతలతో  చర్చించేందుకుగాను  జూపల్లి కృష్ణారావు  జూన్ మొదటి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని  సమాచారం.

click me!