హైదరాబాద్‌లో యోగా మహోత్సవ్.. హాజరైన గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర మంత్రులకు కిషన్ రెడ్డి చురకలు..

First Published May 27, 2023, 1:54 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ 21) పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా మహోత్సవ్‌ నిర్వహించారు. 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ 21) పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా మహోత్సవ్‌ నిర్వహించారు. ఈ యోగా మహోత్సవ్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్‌, పులువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా..  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ వాటాదారుల సహకారంతో భారతదేశం అంతటా 100 వేర్వేరు ప్రదేశాలలో యోగాను ప్రోత్సహించడానికి 100 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2023 మార్చి 13న ప్రారంభమైంది.

ఇలా వివిధ నగరాల్లో యోగా మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 25 రోజుల కౌంట్ డౌన్‌‌తో ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్్‌లో యోగా మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే వేడుకలకు 100 రోజులకు ముందే శ్రీకారం చుట్టామని  చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర‌్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరు ఇళ్లల్లో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులకు కిషన్ రెడ్డిచురకలు అంటించారు. ఇక్కడి నుంచి చేస్తున్న నినాదాలు  చేస్తే ఢిల్లీలో ప్రధాని మోదీకి వినిపించాలని అన్నారు. అలాగే ఇక్కడికి రానివారికి కూడా వినిపించాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇక, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

click me!