ఏప్రిల్ 5,6 రెండ్రోజులు ప్రత్యేక సెలవులు :
రేపటినుండి వరుసగా మూడురోజులు (మార్చి 30 నుండి ఏప్రిల్ 1) పండగ సెలవులు వస్తున్నాయి. మార్చి 30న ఉగాది పండగ... దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. కానీ ఈ పండగ ఆదివారం రావడంతో పండగ సెలవు లేకున్నా సాధారణ సెలవు వచ్చేది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా రెండురోజులు సెలవు ఇచ్చింది. మార్చి 31న రంజాన్ పండగరోజే కాదు తర్వాతి రోజు ఏప్రిల్ 1 న కూడా సెలవు ఇచ్చింది. ఇలా వచ్చే సోమ, మంగళవారం కూడా విద్యార్థులు. ఉద్యోగులకు సెలవే. తిరిగి ఏప్రిల్ 2 బుధవారం స్కూళ్ళు ప్రారంభమవుతాయి.
అయితే ఇలా స్కూళ్లు స్టార్ట్ అయి అలా మూడ్రోజులు గడవగానే వరుసగా మరో రెండ్రోజులు సెలవు వస్తుంది. ఏప్రిల్ 5 మాజీ ఉపప్రదాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్ని ఆరోజు బంద్ కానున్నారు.
ఇక తర్వాతిరోజు అంటే ఏప్రిల్ 6న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరామ నవమి. ఈ రోజున సీతారాముల కల్యాణం అట్టహాసంగా జరుపుకుంటారు. కాబట్టి సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 6 ఆదివారమే కాబట్టి ప్రభుత్వం పండగ సెలవు ఇవ్వకున్నా ఆరోజు సాధారణ సెలవు ఉండేది.
ఇలా వచ్చేవారం మార్చి 30 ఉగాదితో ప్రారంభయ్యే సెలవులు మార్చి 31, ఏప్రిల్ 1 రంజాన్ వరకు కొనసాగుతాయి. మళ్లీ ఏప్రిల్ 5 జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 6 శ్రీరామనవమి సెలవులు వస్తాయి. అంటే వారంలో ఏడురోజులుంటే ఐదురోజులు సెలవులే వస్తున్నాయి... కేవలం మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలు నడిచేది.