Telangana: 5 ఏళ్లలో తెలంగాణ అప్పు ఎంతో తెలుసా? కాగ్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం శాసన సభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించారు. ఇందులో పేర్కొన్న కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Telangana Debt in 5 Years Key Insights from CAG Report on State Finances Details in telugu
CAG Report

2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్పించారు. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం 2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్‌ తెలిపింది. 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. 

Telangana Debt in 5 Years Key Insights from CAG Report on State Finances Details in telugu

ఇదిలా ఉంటే 2023-24 24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్ తెలిపింది. గడిచిన ఏడాది FRBM పరిది సుమారు 200 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పలు కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ. 2.20 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్లు కాగ్‌ తెలిపింది. ఇక కాగ్‌ రిపోర్టులో వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. 

2023-24లో స్థానిక సంస్థలతో పాటు ఇతర సంస్థలకు రూ. 76,776 కోట్ల చెల్లింపులు జరిగాయని, స్థానిక సంస్థలకు 11 శాతం నిధులు పెంచినట్లు కాగ్‌ తెలిపింది. ఇక 2022-24లో ప్రభుత్వం సుమారు రూ. 53,144 కోట్లు అప్పు చేసినట్లు కాగ్‌ తెలిపింది. బడ్జెట్‌ అంచనాలో సుమారు 79 శాతం వ్యయం అయిందని, ఆమోదం పొందిన బడ్జెట్‌ కంటే అదనంగా 33 శాతం ఖర్చు అయినట్లు తెలిపింది. దీని విలువ రూ. 1,11,477 కోలుగా కాగ్‌ నివేదికలో పేర్కొంది. 


ఇక ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్ వెల్లడించింది. రెవెన్యూ రాబడుల్లో 45% సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకు ఖర్చవుతోందని కాగ్‌ నివేదికలో పేర్కొన్నారు. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు రూ49,977 కోట్లుని స్పష్టం చేసింది.

Latest Videos

vuukle one pixel image
click me!