హైదరాబాద్ వన్ డే టూర్ :
ఒకప్పటి హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఈ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ ప్యాకేజీని రూపొందించారు. ఇందులో భాగంగా టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక బస్సులో నగరాన్ని దగ్గరుండి చూపిస్తారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ టూర్ రాత్రి ముగుస్తుంది.
ఈ వన్ డే టూర్ లో హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తారు. ఉదయం 7.30 కి బేగంపేట యాత్రి నివాస్ నుండి ఈ టూర్ ప్రారంభం అవుతుంది... తర్వాత 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. అక్కడ కూడా టూరిస్ట్ లు బస్సు ఎక్కవచ్చు. బిర్లా మందిర్ సందర్శనతో టూర్ ప్రారంభం అవుతుంది.
నాంపల్లిలో ప్రారంభమయ్యే హైదరాబాద్ టూర్ మెల్లిగా పాతబస్తీలోకి ఎంటర్ అవుతుంది. చౌమహల్లా ప్యాలెస్,చార్మినార్, మక్కా మసీదును సందర్శించవచ్చు... లాడ్ బజార్ లో చిన్న స్ట్రీట్ షాపింగ్ చేయవచ్చు. అక్కడినుండి సాలార్ జంగ్ మ్యూజియంకు తీసుకువెళతారు.
మద్యాహ్నం భోజనం తర్వాత నిజాం మ్యూజియం సందర్శించవచ్చు. అక్కడినుండి గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ సందర్శన వుంటుంది. ఇలా హైదరాబాద్ నగరమంతా తిప్పి రాత్రి 7 లేదా 8 గంటలకు హుస్సేన్ సాగర్ తీరంలోని ఐమాక్స్ వద్ద దింపుతారు.