
Telangana Bandh : తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. చాలాకాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటంచేస్తున్న మాదిగ సామాజిక వర్గం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతోంది. ఇదే క్రమంలో మాలలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణనకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది ప్రభుత్వం. దీనికి త్వరలోనే చట్టబద్దత కల్పించే ఎస్సీ వర్గీకరణను ప్రక్రియను అమలుచేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల సామాజికవర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్దం అవుతోంది.
ఎస్సీ వర్గీకరణక అనుకూలంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటసమితి పిలుపునిచ్చింది.
ఎస్సీ వర్గీకరణను మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...
భారత రాజ్యాంగం సామాజికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించింది. ఇలా అంటరానివారిగా తీవ్ర వివక్షను ఎదుర్కొన్న వర్గాలను ఎస్సీ (షెడ్యూల్ కులాలు) చేర్చారు. వీరికి విద్యా, ఉద్యోగాలతో పాటు అనేక రంగాల్లో, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన కులాలకు లబ్ది చేకూరుతోంది.
అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరుగుతుందన్నది మాదిగల వాదన. ఎస్సీల్లో అత్యధిక జనాభా తమదే... కానీ తమకు అతి తక్కువ రిజర్వేషన్ దక్కుతోందని అంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో అత్యధిక శాతం మాలలకే దక్కుతోందనేది మాదిగల వాదన. దీంతో తాము ఇప్పటికీ వివక్షకు గురవుతూనే వున్నామని... సామాజికంగా, ఆర్థికంగా తమకు న్యాయం జరగడంలేదని మాదిగలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం వున్నాయి... వీటిని వర్గాలవారిగా విభజించాలనేది మాదిగల డిమాండ్. ఎస్సీ వర్గీకరణను కోరూతూ దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ లాంటివారు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణకు అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలపడం.
ఇలా ఎస్సీ వర్గీవరణకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వానికి మాలల నుండి తీవ్ర వ్యక్తిరేకత ఎదురవుతోంది. తమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సి వర్గీకరణ చేపట్టకూడదని మాల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మందకృష్ణ మాదిగతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మాల మహానాడు ఆరోపిస్తోంది.
తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేలా తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మాల మహానాడు ప్రకటించింది. విద్యా,ఉద్యోగ, ఉపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తమ అవకాశాలు తగ్గిస్తామని ఊరుకునేది లేదని... ఎంతటి పోరాటానికైనా సిద్దమైనని అంటున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చినట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటసమితి, మాల మహానాడు తెలిపాయి.
ఫిబ్రవరి 14న సెలవు...
ఫిబ్రవరి 14న తెలంగాణలో ఆప్షనల్ హాలిడే వుంది. ముస్లింల పవిత్ర పర్వదినం షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థలకు ఐచ్చిక సెలవు ప్రకటించారు. అంటే స్కూల్, కాలేజీలు ఆరోజు సెలవుపై నిర్ణయం తీసుకుంటాయన్నమాట. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలు ఈ రోజు సెలవు పాటించే అవకాశం వుంటుంది.
ఇక హైదరాబాద్ లోని పాతబస్తీతో పాటు మైనారిటీలు ఎక్కువగా వుండే ప్రాంతాలు, మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా వుండే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు పాటిస్తాయి. మైనారిటీ శాఖ ఉద్యోగులకు కూడా సెలవు వుంటుంది... ఇతర శాఖల్లోని ముస్లిం ఉద్యోగులు కూడా ఈ ఆప్షనల్ హాలిడేను ఉపయోగించుకోవచ్చు. ఇలా తెలంగాణలో ఫిబ్రవరి 14న ఇప్పటికే సెలవు వుంది.
ఇక ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. ఈరోజు తమకు ఇష్టమైన వారిలో హాయిగా గడపాలని యువతీయువకులు కోరుకుంటారు. ఇలాంటి ప్రేమజంటలకు ఈ ఆప్షనల్ హాలిడే, రాష్ట్ర బంద్ కలిసిరానున్నాయి.
School Holidays : ఫిబ్రవరి 14, 15,16 ... ఈ మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవేనా?