Published : Jul 09, 2025, 01:51 PM ISTUpdated : Jul 09, 2025, 02:03 PM IST
వయసు మీదపడ్డా జీవితంతో ఇంకా పోరాడుతూ ఆత్మగౌరవమే ఆస్తిగా జీవిస్తున్న ఈ హైదరాబాద్ తాత కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఈ స్టోరీ చదివాక ఈయనకదా నిజమైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనిపించడం ఖాయం.
Telangana : తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం దశాబ్దాల పోరాటం సాగించిన విషయం అందరికీ తెలిసిందే... ఇది పదవుల కోసమే, స్వపరిపాలన ఆశతో జరిగింది కాదు… తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. ప్రతిదాంట్లో ఆంధ్రోళ్ల పెత్తనాన్ని సహించలేకపోయిన తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని భావించి ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం కంటే తెలగాణ ఉద్యమంలో బలంగా పనిచేసింది ఈ ఆత్మగౌరవ నినాదం.
సహజంగానే ఎవరిదగ్గరా చేయి చాచకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. తెలంగాణ ప్రజల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది... అంబలో, గంజో తాగి బ్రతికేందుకు సిద్దంగా ఉంటారు తప్ప ఆత్మగౌరవాన్ని వదులుకోరు. ఎంతటి కష్టం వచ్చినా తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే హైదరాబాద్ హుస్సెన్ సాగర్ తీరంలో కనిపించే ఈ తాత.
25
ఎవరీ యాదగిరి?
వరంగల్ జిల్లాకు చెందిన యాదగిరికి ఆస్తిపాస్తులు లేవు... వయసులో ఉండగా రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. స్వస్థలంలోనే ఓ దుకాణంలో పనిచేసేవాడు... అయితే అతడికి వయసు మీదపడటంతో ఈ పని చేయలేకపోయాడు. అలాగని ఇంట్లో కూర్చుని తింటే పూటగడవదు... అందుకని పొట్టచేతబట్టకుని భార్యతో హైదరాబాద్ కు చేరుకున్నాడు.
ప్రస్తుతం యాదగిరి వయసు 80-90 ఏళ్లు ఉంటుంది... కాబట్టి ఎక్కడా పని దొరకలేదు. అయినా అతడు నిరాశ చెందలేదు... ఆత్మగౌరవాన్ని వదులుకుని ఎవరి వద్దా చేతులు చాయలేదు. ఎవరూ పని ఇవ్వకుంటే తానే స్వయంగా పనిని సృష్టించుకున్నాడు. ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతూ వచ్చే డబ్బులతో చాలా గౌరవంగా బ్రతుకుతున్నాడు.
35
యాదగిరే నేటి సమాజానికి ఆదర్శం
నేటి సమాజంలో చాలామంది కష్టపడకుండానే డబ్బులు రావాలని అనుకుంటున్నవారే ఎక్కువ. ఇందుకోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని బిక్షాటన చేసేవారు ఉన్నారు... ఇక మరికొందరు మోసాలు, నేరాలకు పాల్పడుతూ సంపాదిస్తున్నారు. ఇలాంటివారు యాదగిరిని చూసి చాలా నేర్చుకోవాలి. కష్టపడి సంపాదిస్తే డబ్బులు తక్కువే రావచ్చు.. కష్టాలు తీరకపోవచ్చు.. కానీ ఆత్మగౌరవంతో బ్రతకొచ్చని యాదగిరి నిరూపిస్తున్నారు.
అతడు ఈ వయసులోనే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై పల్లీలు, మిక్చర్ అమ్ముకుంటున్నారు. నెత్తిపై ఈ పల్లీల బుట్ట పెట్టుకుని, మరోచేత్తో దీన్ని పెట్టేందుకు ఉపయోగించే చిన్న టేబుల్ లాంటిది పట్టుకుని రోజంతా ట్యాంక్ బండ్ పై తిరుగుతుంటారు. గిరాకీ వస్తే వణుకుతున్న చేతులతోనే పల్లీలు, మిక్చర్ మిక్స్ చేసి ఇస్తుంటారు... వాళ్ళు ఇచ్చే డబ్బులను కళ్లకు అద్దుకుని తీసుకుంటారు. ఇలా వృద్ధాప్యంలోనూ కష్టపడూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కష్టపడే వయసు కాదు... అయినా యాదగిరి కష్టాన్నే నమ్ముకున్నాడు. నెల తిరిగేసరికి ఇంటి అద్దె, ఇంట్లోకి సరుకులు కావాలి... అతడితో పాటు అనారోగ్యంతో మంచానపడ్డ భార్యకు మెడిసిన్స్ కొనాలి... ఇందుకు డబ్బులు కావాలంటే కష్టపడాల్సిందే. అందుకే ఒంట్లో సత్తువ లేకున్నా ఆయన జీవన ప్రయాణాన్ని మాత్రం ఆపడంలేదు. ఈ వయసులోనూ కష్టపడి సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
55
యాదగిరి చెబుతున్న జీవిత సత్యాలు..
ఈయన వయసువారు బిడ్డలు పట్టించుకోవడంలేదని బిక్షాటన చేయడం చేస్తుంటాం. మరికొందరు తాగుడుకు బానిసై ఒంట్లోబ పనిచేసే సత్తువ ఉన్నా ఆత్మాభిమానాన్ని వదిలి బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై అడుక్కోవడం చూస్తుంటాం. ఇంకొందరు మరీ నీచంగా చిన్నారులో బిక్షాటన చేయించడం, చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చి అడుక్కుంటడం చూస్తుంటాం. అలాంటివారి యాదగిరిని చూసి తలదించుకోవాల్సిందే... ఆయన బ్రతుకుదెరువు కోసం చేస్తున్న ఈ పని హుస్సెన్ సాగర్ లోని బుద్దుడి మాదిరిగానే ఎన్నో జీవిత సత్యాలను తెలియజేస్తోంది.