ప్రభాస్‌కు ఊరట.. ఇంటిని కూల్చవద్దన్న న్యాయస్థానం

First Published May 4, 2020, 5:26 PM IST

ప్రభాస్ ఇంటికి సంబంధించిన వ్యవహారం కొద్ది రోజులుగా కోర్టులో నలుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని మున్సిపల్ అధికారులు గతంలో ఈ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు.

హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ప్రభాస్‌కు ఓ ఇళ్లు ఉంది. 2083 గజాల్లో నిర్మించిన ఈ ఇంటిని నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేసినట్టుగా మున్సిపల్ అధికారులు వెల్లడించారు. అనుమతిలేని స్థలంలో ఇంటి నిర్మాణం చేయటం చట్ట వ్యతిరేకమన్న అధికారులు ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభాస్‌ కోర్టును ఆశ్రయించారు.
undefined
అయితే ప్రభాస్ వర్షన్‌ మరోలా ఉంది. స్థలం కొనే ముందు డాక్యుమెంట్లు పరిశీలించామని, ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవన్న విషయం తమకు తెలియదని వెల్లడించారు. భారీ మొత్తం ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించామని కాబట్టి ఇంటినీ కూల్చవద్దని కోర్టుకు విన్నవించారు.
undefined
ఇటీవల ప్రభాస్ తనను ఇంటిలోకి అనుమతించాలంటూ ఓ పిటీషన్ వేశాడు. అయితే మున్సిపల్‌ అధికారులు కూడా ప్రభాస్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పిటీషన్‌ వేయటంతో ఇరు వర్గాలకుకోర్టు కొన్ని సూచనలు చేసింది.
undefined
కోర్టు తాజా సూచనల ప్రకారం. ప్రభాస్ ఆ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. అదే సమయంలో అధికారులు ఇంటిని కూల్చే ప్రయత్నం చేయకూదని తెలిపింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్న కోర్టు, ట్రయల్‌ కోర్టుకు కూడా కేసు విషయంలో కొన్ని సూచనలు చేసింది.
undefined
click me!