మేడే స్పెషల్... పారిశుద్ద్య కార్మికులతో కలిసి టిఫిన్ చేసిన హరీష్ రావు

Arun Kumar P   | Asianet News
Published : May 01, 2020, 12:35 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో డాక్టర్లు, పోలీసులు ఎంతగా పనిచేస్తున్నారో వారికంటే ఎక్కువగా పారిశుద్ద్య కార్మికులు పని చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరిష్ రావు అన్నారు. 

PREV
15
మేడే స్పెషల్... పారిశుద్ద్య కార్మికులతో కలిసి టిఫిన్ చేసిన హరీష్ రావు

సిద్దిపేట: మేడే సందర్బంగా శుక్రవారం ఉదయం సిద్ధిపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఆర్థిక మంత్రి హరీష్ రావు సన్మానించారు. పట్టణంలోని కొండమల్లయ్య గార్డెన్స్ లో జరిగిన మేడే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ద్య కార్మికులతో కలిసి మంత్రి సహపంక్తి అల్పాహారం చేశారు. అనంతరం శేషాద్రి ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో ఒక్కొక్కరికీ ఫ్లాస్కులు, ఎన్ఆర్ఐల సహకారంతో నిత్యావసర సరుకుల కిట్స్ ను పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు.  

25

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... కార్మికుడు లేకపోతే అసలు అభివృద్ధి అనేదే లేదంటూ వారిని ఆత్మగౌరవంతో చూస్తున్నామన్నారు. కార్మికులను అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సేనని అన్నారు. కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల భద్రత తమ బాధ్యత అని అన్నారు. ఈ కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమన్నారు. ఈ కష్ట కాలంలో వైద్యులు, పోలీసు ఎంత కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని కొనియాడారు. 

35

సఫాయి అన్న సలాం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.  కరోనా నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ.5వేల అదనపు వేతనం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులకు హక్కులు లభించాయన్నారు. ఎవరూ కూడా పట్టించుకోని బీడీ కార్మికులకు రూ.2 వేల భృతి అందిస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసి అక్కున్న చేర్చుకున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని హరీష్ అన్నారు. 
 
45

కరోనా కాలంలో వలస కార్మికులను చూస్తే బాధ కలుగుతుందని... సీఎం కేసీఆర్ వారిని ఆదుకుంటున్నారని అన్నారు. వారికి భోజనాలు పెట్టి కడుపు నింపడంతో పాటు 12కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేస్తున్నామన్నారు. అలాగే  6 ఏళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించిన కార్మికులను ఇటీవలే సన్మానం చేసుకున్నామని గుర్తుచేశారు. యాజమాన్యం ఎంత ముఖ్యమో కార్మికులు కూడా  అంతే ముఖ్యమన్నారు. 

55

కార్మికులు లేకుంటే అసలు ఉత్పత్తే లేదని... అది లేకుంటే అభివృద్ధి వుండదన్నారు. ప్రభుత్వం, కార్మికులు కలిసికట్టుగా వుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళదామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 

click me!

Recommended Stories