Dasara: 15 కిలోల గొర్రె, బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్.. దసరా పండక్కి కిక్కిచ్చే లక్కీ డ్రా. ఎక్కడంటే?

Published : Sep 24, 2025, 10:14 AM ISTUpdated : Sep 24, 2025, 10:23 AM IST

Dasara: దసరా పండక్కి అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను మొదలుపెట్టాయి. అయితే సూర్యపేటకు చెందిన ఓ చిరు వ్యాపారి చేసి పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

PREV
15
దసరా సీజన్‌కి వినూత్న ఆఫర్

దసరా సందర్భంగా షాపింగ్ మాల్స్, బ్రాండ్లు డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లక్కీ డ్రా పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. అయితే సూర్యాపేటలోని ఓ చిన్న వ్యాపారి కూడా ఇదే విధానాన్ని పాటించాడు. అయితే లక్కీ డ్రాలో గెలిచే బహుమతులే కొంచెం విచిత్రంగా ఉన్నాయి. అందరి దృష్టిని ఆకట్టుకునేలా చేసిన ఈ వెరైటీ ప్రయోగం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆఫర్‌ గురించి స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

25
జానీ చికెన్ సెంటర్‌లో కొత్త ప్రయోగం

సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా చాలాకాలంగా నడుస్తున్న జానీ చికెన్ & మటన్ సెంటర్ గిరాకీ కొంత తగ్గిపోవడంతో యజమాని నాగరాజు ప్రత్యేక ఆలోచన చేశాడు. దసరా పండుగను అవకాశంగా తీసుకుని వ్యాపారానికి కొత్త ఊపునిచ్చేందుకు లక్కీ డ్రా పద్ధతి తీసుకొచ్చాడు.

35
రూ.150 టికెట్‌తో అదృష్ట పరీక్ష

కేవలం రూ.150 చెల్లించి టోకెన్‌ తీసుకుంటే లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఇందులో గెలిచిన వారికి ఆశ్చర్యపరిచే బహుమతులు సిద్ధంగా ఉన్నాయి. మొదటి బహుమతిగా 15 కిలోల బరువున్న గొర్రెపోతు, రెండవ బహుమతిగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. మహిళలకు ప్రత్యేకంగా పట్టు చీరలు కూడా బహుమతుల జాబితాలో ఉన్నాయి.

45
లైవ్ డ్రాతో విజేతల ఎంపిక

నాగరాజు చెప్పిన ప్రకారం దసరా పండుగకు ముందురోజు లైవ్‌లో లక్కీ డ్రా నిర్వహిస్తారు. మొత్తం వందమంది మాత్రమే ఈ అవకాశంలో పాల్గొనేలా పరిమితి పెట్టారు. ఇప్పటికే స్థానికులు ఆసక్తిగా టికెట్లు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

55
వినూత్న ఆలోచనపై లోకల్ చర్చ

స్కూటీలు, గిఫ్ట్ ఆర్టికల్స్ లేదా గృహోపకరణాలు బహుమతులుగా ఇవ్వడం సాధారణమే. కానీ గొర్రెపోతు, ఫుల్ బాటిల్ వంటి బహుమతులు పెట్టడం మాత్రం ఎప్పుడూ వినిపించని ప్రయత్నం. ఈ ప్రయోగం మార్కెట్లో చిన్న వ్యాపారాలు నిలదొక్కుకోవడంలో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories