తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

First Published | Aug 15, 2023, 5:03 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది మూడో వారంలో  అభ్యర్ధుల ఎంపిక చేయాలని  ఆ పార్టీ ప్లాన్  చేస్తుంది. 

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే  చాలా ముందుగానే  అభ్యర్ధులను  ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తుంది.  అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ  నిన్న  హైద్రాబాద్ గాంధీ భవన్ లో సమావేశమైంది. అభ్యర్ధుల ఎంపిక విషయమై  స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్  మురళీధరన్  నేతృత్వంలోని కమిటీ చర్చించింది. పార్టీ టిక్కెట్లు ఆశించే  నేతలు  ధరఖాస్తు  చేసుకోవాలని  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ  చైర్మెన్ మురళీధరన్ కోరారు.  జనరల్  అభ్యర్థులు  రూ. 10 వేలు,  ఇతర సామాజిక వర్గాలకు  చెందిన అభ్యర్థుల నుండి  రూ.2500  ఫీజు వసూలు చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈ నెల  18వ తేదీ నుండి  టిక్కెట్లు ఆశించే అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను  స్వీకరించనుంది కాంగ్రెస్ నాయకత్వం. 

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని  అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  ముందుగానే  పోటీ చేసే అభ్యర్ధులను  ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేని  అసెంబ్లీ  నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది.  అభ్యర్ధుల ఎంపికలో  సర్వేలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే  కొన్నిసమయాల్లో  సర్వేలతోపాటు ఇతర అంశాలను  కూడ  ప్రామాణికంగా తీసుకుంటామని  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు


తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

పార్టీ నాయకత్వానికి  ఎలాంటి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన  అభ్యర్ధుల పేర్లను  వీలైతే ఈ నెల  17వ తేదీ తర్వాత ప్రకటిస్తే ఎలా ఉంటుందనే  చర్చ కూడ పార్టీ  వర్గాల్లో నెలకొంది. అయితే  ఈ విషయమై  ఇంకా  స్పష్టత రావాల్సి  ఉంది.ఈ నెల చివరి నాటికి  40 మంది అభ్యర్థులను ఖరారు చేయాలనే యోచనలో  స్క్రీనింగ్ కమిటీ ఉంది.  ఈ దిశగా  కార్యాచరణ సాగిస్తుంది ఆ పార్టీ నాయకత్వం. నిన్నటి సమావేశంలో  టిక్కెట్ల కోసం పోటీ లేని  అసెంబ్లీ నియోజకవర్గాలపై  పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఫోకస్ చేసింది. పోటీ పడే  అభ్యర్థుల బలాబలాలను  పార్టీ నాయకత్వం  చర్చించింది.

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నలుగురైదుగురు  అభ్యర్ధులను టీపీసీసీ నాయకత్వం స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచుతుంది.  అయితే  టిక్కెట్టు కోసం పోటీ పడే  అభ్యర్థులను  స్క్రీనింగ్ కమిటీ పిలిపించి  మాట్లాడుతుంది.  అయితే  ఈ సమయంలో పార్టీ సర్వే రిపోర్టుతో పాటు  సామాజిక అంశాలతో పాటు క్షేత్రస్థాయిలోని అంశాలను కూడ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది.  స్క్రీనింగ్ కమిటీ ఒక్క అభ్యర్థి పేరును నాయకత్వానికి పంపనుంది.కాంగ్రెస్ పార్టీ ప్రకటించే  తొలి జాబితాలో బీసీ అభ్యర్ధుల పేర్లుంటాయి.  బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు  కనీసం  50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు.అయితే 50 సీట్లు ఇవ్వకపోయినా  కనీసం  20 నుండి 30 సీట్లు బీసీ  సామాజిక వర్గానికి కేటాయించే  అవకాశం లేకపోలేదనే  అభిప్రాయం ఆ పార్టీకి చెందిన  బీసీ నేతల్లో  ఉంది.

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అధికారానికి దూరంగా ఉంది. అయితే దీనికి పలు రకాల కారణాలను ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఈ దఫా మాత్రం  అధికారాన్ని దక్కించుకోవాలని  ఆ పార్టీ  నేతలు  పట్టుదలగా ఉన్నారు.  ఈ దిశగా  పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.  అయితే  రాజకీయ ప్రత్యర్ధులు  వ్యూహాలకు  ధీటుగా  జాగ్రత్తగా అడుగులు వేస్తూ  ముందుకు సాగుతుంది కాంగ్రెస్ నాయకత్వం. 
 

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య గ్యాప్ తగ్గించేందుకు  పార్టీ  జాతీయ నాయకత్వం  చొరవ తీసుకుంది.  ఎన్నికలకు  ఎక్కువ సమయం లేకపోవడంతో  పార్టీ నేతలు మరింత  సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.గత వారం  రాష్ట్ర పర్యటనకు  వచ్చిన  పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు.

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

వచ్చే ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ  నేతలు  ప్లాన్  చేస్తున్నారు. ఇందుకోసం  ఇతర పార్టీల్లో అసంతృప్తులకు  గాలం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది.శ్రావణ మాసంలో మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వలసలపై  కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెంచింది.  బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని  ప్రజలకు  సంకేతాలు ఇవ్వాలని  ఆ పార్టీ  దూకుడును పెంచనుంది. 

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్: సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ పరిస్థితిపై  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎప్పటికప్పుడు  తెలుసుకుంటున్నారు. కర్ణాటకలో విజయం  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణలో కూడ విజయం సాధించాలని  ఆ పార్టీ భావిస్తుంది.  మరో వైపు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం కోసం  చర్యలకు  ఆ పార్టీ నాయకత్వం చర్యలకు  పూనుకుంటుంది. ఇందిరా గాంధీని గతంలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కున చేర్చుకుంది.  దీంతో  ఏపీపై  కూడ  ఆ పార్టీ ఫోకస్   పెట్టింది. ఈ దిశగా కార్యాచరణను సిద్దం  చేసింది.  

Latest Videos

click me!