Cold Wave Alert: ఏపీతో పాటు తెలంగాణలో చలి పంజా విసురుతోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నా ఉదయం రాత్రుళ్లు మాత్రం చలి చంపేస్తోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలపై చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో సాధారణ జీవనం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఏపీ మన్యం జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
26
తెలంగాణలో చలి పంజా
తెలంగాణలో చలి గాలులు బలంగా వీస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు నమోదు కాగా, మెదక్‌లో 7.2 డిగ్రీలు, హనుమకొండలో 8.6 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 11.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 12.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల శుక్రవారం సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదైంది.
36
మూడు రోజులు ఇదే పరిస్థితి
రానున్న రెండు మూడు రోజులు చలి తీవ్రత తగ్గే సూచనలు లేవని అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో చలి నమోదవుతోంది. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.
56
వృద్ధులు, చిన్నారులకు ప్రమాదం
చలి తీవ్రత వల్ల వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఉదయం తొందరగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు తగ్గించుకోవడం, ఉన్ని దుస్తులు ధరించడం అవసరం అని తెలిపారు.
66
మన్యం జిల్లాల్లో మరీ దారుణం
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాల్లో చలి మరింత తీవ్రంగా ఉంది. పాడేరు, అరకులో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీల వరకు చలి పడిపోయింది. పొలాల్లో నీరు గడ్డకట్టడంతో రైతులు ఉదయం వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు తొలగడం లేదు.