Published : Mar 11, 2022, 12:40 PM ISTUpdated : Mar 11, 2022, 01:28 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం హుటాహుటిన ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కెసిఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
26
KCR at Yashoda Hospital
సిటీ స్కాన్ , యాంజియోగ్రామ్ పరీక్షలు చేసి ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. అస్వస్థత నేపథ్యంలో యాదాద్రి పర్యటనను కేసీఆ రద్దు చేసుకున్నారు.
36
KCR at Yashoda Hospital
కేసీఆర్ ఆరోగ్య పరిస్తితిపై ఆయన వ్యక్తి గత వైద్యుడు డా. ఎంవీరావు పలు విషయాలు వెల్లడించారు. కేసీఆర్ కు ఎడమచేయి లాగుతుందని చెప్పారన్నారు. ఆయన రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని చెప్పారు. .
46
కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ లు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
56
KCR
సీఎం కేసీఆర్ ప్రతి యేటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటామని.. రెండ్రోజులుగా ఆయన వీక్ గా ఉందని చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమచెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే అది డాక్టర్ ఎంవీరావు అన్నారు.
66
KCR at Yashoda Hospital
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.