Telangana Budget 2022 : అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. ఈటెల

First Published Mar 7, 2022, 12:16 PM IST

ఇప్పుడు మేము ముగ్గురం కావొచ్చు... కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం... రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.  అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అంటూ బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత మొదటిసారి అసెంబ్లీకి హాజరవుతున్న ఈటెల రాజేందర్ హెచ్చరించారు. 

Etela rajender

ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ ముందుగా.. టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. 

Etela rajender

అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తరువాత నిర్భంద పాలన నశించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులు నివాళులు అర్పించారు. 

ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం అని..  దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు అంటూ నినదించారు. కానీ కెసిఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే.  

Latest Videos


Etela rajender

అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ గారికే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుందని అన్నారు. మాట్లాడుతుంటే మైకులు కట్ చేసి అవమానిస్తారు. ఇక ఈ సారి మాట్లాడే అవకాశం ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది. ఇప్పుడు మేము ముగ్గురం కావొచ్చు... కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం... రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.  అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అంటూ హెచ్చరించారు.

Etela rajender

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. కెసిఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

click me!