తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు సీఎం పదవి

First Published | Jul 4, 2023, 9:57 AM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలో అధికారం దక్కించుకొనేందుకు  బీజేపీ  నాయకత్వం  కసరత్తు  చేస్తుంది.  ఈ మేరకు  వ్యూహాత్మకంగా ముందుకు  వెళ్తుంది.

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

తెలంగాణలో ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నాయకత్వం  కసరత్తు  చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ  సామాజిక వర్గం ఓటర్లు  ఆయా పార్టీల గెలుపు, ఓటములను  ప్రభావితం చేస్తారు. తెలంగాణలో బీసీలకు  సీఎం పదవిని  ఇస్తామని  బీజేపీ  ప్రకటించే అవకాశం ఉందని  సమాచారం.ఈ దిశగా  బీజేపీ నాయకత్వం  కసరత్తు  చేస్తుందని పార్టీ వర్గాల్లో  ప్రచారంలో ఉంది

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా  ఉన్న బండి సంజయ్ బీసీ సామాజికవర్గానికి  చెందిన నేత.  రాష్ట్రానికి చెందిన  కొందరు  బీజేపీ నేతలు  బండి సంజయ్ ను   ఈ పదవి నుండి తప్పించాలని  బీజేపీ అగ్రనాయకత్వాన్ని కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. 

Latest Videos


తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

బండి సంజయ్ ను  ఈ పదవి నుండి తప్పించి  మరొకరికి ఈ బాధ్యతలను  అప్పగిస్తారనే  ప్రచారం కూడ లేకపోలేదు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  నిన్న ముంబై నుండి న్యూఢిల్లీకి వెళ్లారు.  పార్టీ నాయకత్వం  పిలుపు మేరకు  బండి సంజయ్  న్యూఢిల్లీకి వెళ్లినట్టుగా  ప్రచారం సాగుతుంది.

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

బండి సంజయ్ ను   పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని పార్టీలో  కొందరు  నేతలు  కోరుతున్నారు. మరో వైపు  బండి సంజయ్  నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.  ఈ విషయమై  బీజేపీ నేతలు  పరస్పరం  విమర్శలు  చేసుకుంటున్నారు. 

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలో  బీజేపీ ఇప్పటికే అధికారాన్ని కోల్పోయింది.  తెలంగాణలో  అధికారంలోకి రావాలని పట్టుదలతో  బీజేపీ నాయకత్వం ఉంది.  అధికారంలోకి రాలేకపోయినా  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి   అధిక ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే  పట్టుదలతో  కమలదళం ఉంది. 

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

తెలంగాణ  రాష్ట్రంలో  బీసీ సామాజిక వర్గానికి  చెందిన బండి సంజయ్ ను  కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడమో, లేదా ఇతర పదవిని కట్టబెట్టాలని  పార్టీ నాయకత్వం  యోచిస్తుందనే  ప్రచారం సాగుతుంది.   బీసీ సామాజిక వర్గానికి సీఎం పదవిని కట్టబెడుతామని ప్రకటించి  ఎన్నికలకు   వెళ్లాలని  బీజేపీ  నాయకత్వం  యోచిస్తుందనే  సమాచారం.   అయితే  బీసీ సామాజిక వర్గానికి  చెందిన  బండి సంజయ్ ను  అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే  రాజకీయంగా ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశం  లేకపోలేదనే  అభిప్రాయాలను  కూడ కొందరు  పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఏ వ్యూహాంతో  ముందుకు వెళ్తే  రాజకీయంగా  ప్రయోజనం కలుగుతుందనే  విషయమై  కమలదళం  మల్లగుల్లాలు పడుతుంది.

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

2014 లో తెలంగాణలో  బీసీలకు  సీఎం పదవిని  ఇస్తామని  టీడీపీ ప్రకటించింది.  ఆ ఎన్నికల్లో  బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షుడు  ఆర్. కృష్ణయ్యను   సీఎం అభ్యర్ధిగా  టీడీపీ  ప్రచారం చేసింది. కానీ  ఆ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.  అయితే  దీనికి అనేక  కారణాలున్నాయనే అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం  చేస్తున్నారు.  అయితే  బీసీలకు  సీఎం పదవి అనే నినాదంతో  బీజేపీ ముందుకు వెళ్తే  ఏ మేరకు ఆ పార్టీకి కలిసి వస్తుందోననే విషయమై  ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. 

తెలంగాణలో బీజేపీ వ్యూహాం : బీసీలకు  సీఎం పదవి

ఇదిలా ఉంటే  బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  పార్టీలో కీలక పదవిని కట్టబెట్టనున్నారు.  త్వరలోనే  రాజేందర్ కు  పదవి విషయాన్ని కమలదళం  ప్రకటించే అవకాశం ఉందని  సమాచారం.అంతేకాదు బీసీ సామాజిక వర్గానికి  చెందిన  నేతలకు  పార్టీలో పదవుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని  పార్టీ భావిస్తుంది.

click me!