స్పా ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్ లో ముఠా గుట్టు రట్టు..

First Published | Jul 4, 2023, 9:22 AM IST

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో స్పా ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో స్పా, మసాజ్ సెంటర్ల ముుసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నాయి. 

తాజాగా  హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పాపై పోలీసులు దాడులు నిర్వహించారు.  


వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. రోడ్ నెంబర్ 12 లోని రువాన్ థాయ్ స్పాలో ఈ అనైతిక వ్యవహారం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారంతో దాడులు చేసి, కొంతమందిని అరెస్టు చేశారు.

వీరిలో థాయిలాండ్ కు చెందిన నన్ని, సుజీ, అవా, హనా, ఆప్లే మసాజ్ థెరపిస్టులుగా పనిచేస్తున్నారు. స్పా యజమాని సల్మాన్, ఖాలీద్ అనే వ్యక్తులు వీరిని సెక్స్ వర్కర్లుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఈ స్పా మీద టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది 

అయితే నిర్వాహకుడు సల్మాన్ పోలీసులను చూసి పరారు కాగా ఖాలిద్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ప్రసూన్ ప్రకాష్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పదిమంది వీటిలకు నోటీసులు జారీ చేశారు. 

Latest Videos

click me!