బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
తెలంగాణ భవన్ లో గురువారంనాడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ జనరల్ బాడీ ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనరల్ బాడీ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచారణపై కేసీఆర్ పా్రటీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ సమావేశానికి ఎంపిక చేసిన 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. బీఆర్ఎస్ గా పార్టీ మారిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ కు చేరుకున్న వెంటనే తెలంగాణ తల్లి విగ్రహనికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జయశంకర్ విగ్రహనికి నివాళులర్పించారు. పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది.
బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. అంతేకాదు పలు తీర్మానాలను కూడా ఆమోదించనున్నారు.
ఈ సమావేశంలో గ్రామీణ ప్రగతి, విద్య, ఉపాధి, వ్యవసాయం, బీజేపీ వైఫల్యాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
BRS General Body Meeting
2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఏర్పడింది. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో పార్టీ పేరును టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చారు.ఈ మేరకు 2022 అక్టోబర్ 5న పార్టీ జనరల్ బాడీ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
BRS General Body Meeting
బీఆర్ఎస్ గా పార్టీ మారకముందు ప్రతి ఏటా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించేవారు. అయితే ఈ దఫా మాత్రం అక్టోబర్ మాసంలో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు పూర్తయ్యాయి. ఇవాళ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలను ఈ ఏడాది మే చివరి వరకు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.