సీఎం కాలేననే బాధతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు: ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదన్న బండి

First Published | Apr 23, 2023, 1:23 PM IST

భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  కన్నీళ్లు పెట్టుకుంటూ  బీజేపీ నేత ఈటల రాజేందర్ పై  రేవంత్  రెడ్డి  నిన్న  విమర్శలు  చేశారు.ఈ విమర్శలపై  బండి సంజయ్  ఇవాళ కౌంటర్ ఇచ్చారు.  

బండి సంజయ్

సీం కాలేనని  బాధతోనే  రేవంత్ రెడ్డి  కన్నీళ్లు పెట్టుకున్నారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు   బసవేశ్వరుడి  విగ్రహానికి  బండి  సంజయ్  నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఆయన  మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని తెలిసి పీసీసీ పదవి నుండి తప్పిస్తారనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకున్నారేమోనని  బండి సంజయ్  అనుమానం వ్యక్తం  చేశారు. . 
 

బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదని  ఆయన సెటైర్లు  వేశారు.  రేవంత్ ఏడుపు నిజమే. బాధ ఉంటేనే ఏడుస్తారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నారన్నారు.   కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు.  ఈ బాధతోనే  రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని  బండి సంజయ్  ఎద్దేవా చేశారు.  పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను మారుస్తారనే బాధ కూడా  రేవంత్ కు కన్నీళ్లు వచ్చాయని బండి సంజయ్  వ్యాఖ్యానించారు.  
 

Latest Videos


బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ అన్నదాంట్లో తప్పేముందన్నారు.  ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ప్రతిపక్షాల కూటమికి ఛైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చంతా నేనే పెట్టుకున్నానని కేసీఆర్ చెప్పినట్లు మీడియాలో వచ్చింది కదా... దానికి ప్రూఫ్ ఉందా? అని  బండి సంజయ్ ప్రశ్నించారు.  
 

బండి సంజయ్

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకీ బీఆర్ఎస్ డబ్బులు సాయం చేస్తోంది? నిజమా? కాదా? చెప్పాలన్నారు.  
 కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనన్నారు.   మల్లిఖార్జున్ ఖర్గే కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నిస్తున్నామని రాజ్ దీప్ సర్దేశాయ్  ఇంటర్వ్యూలో  చెప్పిన మాటలను  బండి  సంజయ్ ప్రస్తావించారు.  

బండి సంజయ్

 బసవేశ్వర బోధనలకు అనుగుణంగా  మోడీ  పాలన కొనసాగిస్తున్నారన్నార.  . బసవేశ్వర బోధనలను ప్రపంచానికి చాటిన వ్యక్తి మోడీ అని  ఆయన కొనియాడారు. లింగాయత్ లను ఓబీసీలను చేర్చాలనే డిమాండ్ ఉందన్నారు. . ఓబీసీ మోర్చా నాయకత్వంలో కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన సమర్పించినట్టుగా  చెప్పారు.  లింగాయత్ లను  ఓబీసీలో చేర్పించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని  ఆయన  హామీ ఇచ్చారు.  

బండి సంజయ్


అతీక్ అహ్మద్ ఎన్ కౌంటర్ పై ఎంఐఎం నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 
అతీక్ అహ్మద్‌ను   ఎన్ కౌంటర్ చేస్తే తప్పేముందని  ఆయన  ప్రశ్నించారు.   దానిని ఎంఐఎం నేతలు, బీఆర్ఎస్ నేతలు ఖండించడం సిగ్గుచేటు.

click me!