హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జీగా పాడి కౌశిక్ రెడ్డి: ఈటలకు చెక్ పెట్టేనా?

First Published | Apr 19, 2023, 9:48 AM IST


బీఆర్ఎస్  హుజూరాబాద్ అసెంబ్లీ  నియోజకవర్గ  ఇంచార్జీగా  పాడి కౌశిక్  రెడ్డిని  నియమించింది  ఆ పార్టీ.
 

పాడి కౌశిక్ రెడ్డి

 ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలోని  హుజూరాబాద్ అసెంబ్లీ   నియోజకవర్గానికి  బీఆర్ఎస్ ఇంచార్జీగా  పాడి కౌశికర్ రెడ్డిని  ఆ పార్టీ నియమించింది.

పాడి కౌశిక్ రెడ్డి

 వచ్చే  ఎన్నికల్లో  కౌశిక్ రెడ్డికి  బీఆర్ఎస్  నాయకత్వం  టిక్కెట్టు కేటాయించే  అవకాశం ఉంది.   వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో  ఈటల రాజేందర్  ను  అసెంబ్లీలో  అడుగు పెట్టకుండా  అడ్డుకొనేందుకు  బీఆర్ఎస్ నాయకత్వం  వ్యూహత్మకంగా  అడుగులు వేస్తుంది.


పాడి కౌశిక్ రెడ్డి

 కాంగ్రెస్  ను వీడి  బీఆర్ఎస్ లో  చేరిన  పాడి కౌశిక్ రెడ్డికి  ఆ పార్టీ నాయకత్వం  ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 
బీఆర్ఎస్  ను వీడిన  ఈటల రాజేందర్  బీజేపీలో  చేరారు.  బీజేపీలో  చేరడానికి ముందు  ఈటల రాజేందర్  హుజూరాబాద్  ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా  చేశారు. దీంతో  హుజూరాబాద్ అసెంబ్లీ  ఎన్నికల్లో   ఈటల రాజేందర్  బీజేపీ అభ్యర్ధిగా  పోటీ  చేసి విజయం సాధించారు. 

పాడి కౌశిక్ రెడ్డి

ఈటల  రాజేందర్  పై  గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను  బీఆర్ఎస్ బరిలోకి దింపింది. అయితే  ఈ నియోజకవర్గ ప్రజలు   ఈటల రాజేందర్ కే పట్టం కట్టారు.హుజూరాబాద్ అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల తర్వాత  నియోజకవర్గంలో  పాడి కౌశికర్ డ్డి  మరింత దూకుడుగా  వెళ్తున్నారు.   నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు  ప్రయత్నిస్తున్నారు.  బీఆర్ఎస్ నాయకత్వం  కూడ   కౌశిక్ రెడ్డికి  అండగా ఉంది.  

పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ అసెంబ్లీ  నియోజకవర్గ ఇంచార్జీగా   పాడి కౌశిక్ రెడ్డిని నియమించడం   రానున్న  ఎన్నికలను దృష్టిలో  పెట్టుకొని  నిర్ణయం తీసుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి

 గతంలో  ఈటల రాజేందర్ పై  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన  పాడి కౌశిక్ రెడ్డి  60 వేలకు  పైగా ఓట్లను సాధించారు. ఈటల రాజేందర్ కు గట్టి పోటీని ఇచ్చారు.  బీఆర్ఎస్ లో  చేరిన  సమయంలో  తన వెంట కాంగ్రెస్ క్యాడర్ ను కూడా  కౌశిక్ రెడ్డి  తెచ్చుకున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ లో  విజయం సాధించిన  ఈటల రాజేందర్  బీఆర్ఎస్ కు  కొరకరాని కొయ్యగా మారారు.  హుజూరాబాద్ లో  ఈటల రాజేందర్ ను  ఓడించాలని ఆ పార్టీ ఇప్పటినుండే  పావులు  కదుపుతుంది . ఇందులో  భాగంగానే  కౌశిక్ రెడ్డిని   ఇంచార్జీగా  నియమించిందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి

ఇదిలా  ఉంటే  హుజూరాబాద్ అసెంబ్లీ  నియోజకవర్గంలో  గెల్లు శ్రీనివాస్ యాదవ్,  పాడి కౌశిక్  రెడ్డిలకు వర్గాలున్నాయి.  అయితే  కౌశిక్ రెడ్డికి  గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం  ఏ మేరకు  సహకరిస్తుందనేది  భవిష్యత్తు  తేల్చనుంది.  గతంలో  పలుమార్లు  గెల్లు శ్రీనివాస్ యాదవ్,  పాడి కౌశిక్ రెడ్డిలు  వేర్వేరుగా కార్యక్రమాలు  నిర్వహించిన  విషయం తెలిసిందే. 

Latest Videos

click me!