School Holidays : దేశంలో మరెక్కడా లేవు.. తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ మూడ్రోజులు స్పెషల్ హాలిడేస్

Published : Jul 09, 2025, 05:06 PM IST

కేవలం తెలంగాణ స్టూడెంట్స్‌, ఉద్యోగులకు మాత్రమే ప్రతిఏటా మూడ్రోజులు ప్రత్యేకంగా సెలవులు వస్తాయి. ఈ సెలవులు దేశంలో మరెక్కడా లేవు. ఇలా తెలంగాణోళ్లకే వచ్చే ఆ సెలవులేంటి? ఎప్పుడెప్పుడు వస్తాయి? ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కేవలం తెలంగాణోళ్లకు మాత్రమే మూడ్రోజులు సెలవులు

Telangana Holidays : ఒకే రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వేరుపడిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల క్రితం వరకు ఈ రెండూ ఒకటే రాష్ట్రంగా ఉండేవి... కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలు సంస్కృతి, సాంప్రదాయలు ఒకేలా ఉంటాయి. పండగలు, ప్రత్యేక పర్వదినాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే.. అందుకే సెలవులు కూడా ఒకేలా ఉంటాయి. సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్.. ఇలా ప్రతి పండక్కి అటు ఏపీ, ఇటు తెలంగాణలో సెలవులు ఉంటాయి.

25
తెలంగాణోళ్లకే వర్తించే సెలవులివే

అయితే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కేవలం తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే ఓ మూడురోజులు ప్రత్యేక సెలవులు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో మరెవ్వరికీ ఈ సెలవులు ఉండవు. ఇలా కేవలం తెలంగాణవారికి మాత్రమే వర్తించే ఆ సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

35
1. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది… ఇందుకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటారు. జూన్ 2న తెలంగాణవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికగా ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జరుపుతుంది. కేవలం తెలంగాణ ప్రజలకే ప్రత్యేకమైన ఈరోజు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది.

తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం 2014 ఆరంభంలోనే జరిగింది... మార్చి 1న రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రం ఏర్పాటయ్యింది. అయితే 2014 జూన్ 2 తెలంగాణను దేశంలో 29వ రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది.. దీంతో ప్రతిఏటా జూన్ 2న హైదరాబాద్ తో పాటు అన్ని తెలంగాణ జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇందుకోసం విద్యాసంస్థలు, ఉద్యోగులుకు సెలవు ఇస్తారు.

45
2. బోనాల పండగ

ఇక తెలంగాణ ప్రజలు మాత్రమే జరుపుకునే వేడుకలు ఆషాడమాసం బోనాలు. ప్రతి వర్షాకాలం ఆరంభంలో అంటే ఆషాడమాసంలో ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు... మేకలు, కోళ్లను అమ్మవారికి బలిచ్చి కుటుంబమంతా విందు జరుపుకుంటారు. హైదరాబాద్ లో అయితే ఆషాడమాసం మొత్తం ఏదో ఒకచోట ఈ బోనాల వేడుకలు జరుగుతాయి.

ఆషాడమాసం ఆరంభంలో గోల్కొండ బోనాలతో ప్రారంభమే హైదరాబాద్ బోనాలతో ఈ వేడుకలు ముగుస్తాయి. మధ్యలో బల్కంపేట, సికింద్రబాద్ ఉజ్జయిని, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవార్ల ఆలయాల్లో బోనాల ఉత్సవాలు అట్టహాసగా జరుగుతాయి. ఈ బోనాల నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఉంటుంది.

బోనాల వేడుకలు ఆదివారమే జరగ్గా హైదరాబాద్ బోనాల తర్వాతిరోజును తెలంగాణవ్యాప్తంగా అధికారిక సెలవుగా ప్రకటిస్తారు. ఇలా ఈసారి జులై 20న హైదరాబాద్ బోనాలు జరుగుతున్నాయి.... కాబట్టి జులై 21న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది. ఈ బోనాల పండగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం... కాబట్టి ఇక్కడివారికి మాత్రమే సెలవు ఉంటుంది.

55
3. బతుకమ్మ పండగ

తెలంగాణ ఆడపడుచులు ప్రకృతిని పూజించే పండగే బతుకమ్మ. ఈ పూల పండగను దసరా పండక్కి ముందు తొమ్మిదిరోజులపాటు జరుపుకుంటారు. ఆడపడుచులంతా ఒక్కచోటికి చేరి ప్రకృతిలో సహజంగా లభించే గూనుగు పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా భావించి కొలుస్తారు. ఇలా 9 రోజులు 9 రకాలుగా వేడుకలు జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.

ఇలా తెలంగాణ పండగ బతుకమ్మ ప్రారంభంరోజు అంటే ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఇక సద్దుల బతుకమ్మ సరిగ్గా దసరా ముందు వస్తుంది... ఆరోజు కూడా కొందరికి సెలవు ఉంటుంది. ఈ బతుకమ్మ పండగ దేశంలో మరెక్కడా చేసుకోరు... ఏపీలో కూడా ఈ పండగ కనిపించదు. కాబట్టి ఈ బతుకమ్మ సెలవు కూడా కేవలం తెలంగాణ వారికే ప్రత్యేకంగా లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories