స్వయంకృతాపరాదం: తెలంగాణలో బీజేపీ దూకుడు, వెనుకబడ్డ కాంగ్రెస్

First Published Jul 15, 2020, 6:12 PM IST

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ఎదుర్కొనే శక్తి ఉందని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల స్వయంకృతాపరాదం కారణంగా ఆ పార్టీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో తెలంగాణపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది.
undefined
తెలంగాణ రాష్ట్రంపై గత ఎన్నికల నుండి బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలను ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిని కేంద్రీకరించింది.
undefined
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున రాష్ట్రంలో తమకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన మేర ప్రయోజనం దక్కలేదు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కలేదు.
undefined
వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఆ పార్టీకి నెలకొన్నాయి. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. కీలక నాయకులు స్తభ్దుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పదవి కాలం ముగిసింది. కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని రాష్ట్ర నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. కొందరు నేతలు పీసీసీ పదవిని ఆశిస్తున్నారు.
undefined
కానీ పీసీసీ చీఫ్ పదవి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన మాత్రం బయటపెట్టడం లేదు. తమకు పీసీసీ చీఫ్ పదవిని తమకు ఇస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని కొందరు నేతలు ముందుకు వచ్చారు.
undefined
రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిన నేపథ్యంలో ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షం అనే పద్దతిలో కమల దళం వ్యవహరించడం కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
undefined
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై బీజేపీ నాయకత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. విద్యుత్ బిల్లులు, కరోనా పరీక్షలు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు విసయమై బీజేపీ నాయకత్వం ఆందోళనలు నిర్వహించింది.
undefined
రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగడం రాజకీయంగా కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. అయితే కరోనా టెస్టులు, విద్యుత్ బిల్లుల విషయంలో కూడ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది.గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలను రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా పట్టించుకోని కారణంగా కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది.
undefined
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బీజేపీకి పనిచేసిందని టీఆర్ఎస్ అప్పట్లో ఆరోపించింది. దీంతోనే ఈ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని టీఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయపడింది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఓటమి పాలై బీజేపీ విజయం సాధించడానికి కూడ కాంగ్రెస్ పార్టీ సరైన ప్లాన్ చేయకపోవడమే కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
undefined
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకత్వం ఇప్పటికే దూకుడుగా విమర్శలు చేస్తోంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాహనంపై వరంగల్ లో టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
undefined
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలపై బీజేపీ నాయకత్వం గురి పెట్టింది. బీజేపీ నాయకులు ఇప్పటికే కొందరు నేతలతో చర్చించినట్టుగా కూడ ప్రచారం సాగింది. టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరింత శక్తిని కూడదీసుకోవాలి.
undefined
అయితే అప్పటివరకు కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ముందుకువెళ్లాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో దూకుడుగా ఆ పార్టీ పనిచేస్తోంది. బీజేపీ దూకుడును నిలువరించకపోతే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
click me!