ఉజ్జయిని మహంకాళి బోనాలు... తొలి బోనం సమర్పించిన తలసాని సతీమణి

First Published Jul 12, 2020, 10:33 AM IST

ప్రతి ఏటా హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగే తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడింది. 

హైదరాబాద్: ప్రతి ఏడాది ఆషాడమాసంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బోనాల సందడి వుండేది. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది ఎలాంటి హడావుడి లేకుండా బోనాల పండగ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరవాసులు ఇంట్లోనే కేవలం కుటుంబసభ్యులతో కలిసి బోనాల పండగా జరుపుకుంటున్నారు.
undefined
ఇవాళ సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు అత్యంత సాదాసీదాగా బోనాలను సమర్పించుకుంటున్నారు. ప్రతిసారి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటినుండే తొలిబోనం సమర్పించడం ఆనవాయితీ. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి తొలి బోనం ఆలయం బయటే పండితులకు అందజేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ.
undefined
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడనుంది. బోనాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించేందుకు యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ నెల 25 నుండి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 10వతేదీన మంత్రులు సమావేశమై దీనిపై ఒక అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
undefined
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడనుంది. బోనాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించేందుకు యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ నెల 25 నుండి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 10వతేదీన మంత్రులు సమావేశమై దీనిపై ఒక అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
undefined
ప్రతి సంవత్సరం ఆలయంలో బోనాలను సమర్పించేవారు భక్తులు. అయితే ఇలా ఆలయంలోకి భక్తులను అనుమతించడం వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం వుందని ప్రభుత్వ భావించింది. ఈ నేపథ్యంలోనే శుక్ర‌వారం నుంచే ఉజ్జ‌యినీ మ‌హంకాళీ ఆల‌యంలో ద‌ర్శ‌నాల‌ను అధికారులు నిలిపివేశారు.
undefined
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించింది. ప్రతి ఏడాది బోనాల జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది. ఈ సారి కరోనా కారణంగా నిధులు విడుదల చేయలేదు. ఈసారి బోనాల్లో ఘటాల ఊరేగింపు, పోతరాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలు లేకుండానే సాదాసీదాగా ఆషాఢ బోనాల జాతర నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలను జారీచేశారు.
undefined
click me!