హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు.
ఆయన టెస్ట్ చేపించుకోవడంతోపాటుగా అందరిని లక్షణాలు ఉంటె టెస్టులు చేయించుకోవడానికి ముందుకురావాలని కోరారు. దక్షిణ హైదరాబాద్ లో 30 సెంటర్లలో టెస్టులు చేస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణాలో టెస్టులను పెంచిన నేపథ్యంలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టుల్లో కరోనా లక్షణాలుండి నెగటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకోవాలి. అదే పాజిటివ్ వస్తే అవసరం లేదు.
ఇకపోతే... తెలంగాణలో గడిచిన కొద్దిరోజుల నుంచి ఉగ్రరూపం చూపుతున్న కరోనా వైరస్ కాస్త కూడా దయ చూపడం లేదు. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.