ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకపోవడం, పూర్తిగా హిందూత్వ అజెండాపైనే ఆధారపడటం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే వారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ వీడనున్నారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఈ పరిణామాలతో పార్టీలో బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి.