కొంచెం ఆలోచించండి తమ్ముళ్లూ.. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డిలకు విజయశాంతి చురకలు..

First Published Apr 22, 2023, 11:50 AM IST

పరస్పరం మాటల యుద్ధంతో ఒకరినొకరు సవాల్ చేసుకోవడం కాదని.. బీఆర్ఎస్ మీద ఎవరి ధోరణిలో వారు పోరాడాలని.. కాస్త ఆలోచించాలని విజయశాంతి అన్నారు. 

హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులందరూ విజయశాంతి మరోసారి తెరమీదకి వచ్చారు. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలకు చురకలంటిస్తూ ఓ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లను తమ్ముళ్లు అంటూ ఈ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి, ఈటెల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ కు 25 కోట్ల రూపాయలు ఇచ్చారని ఈటెల  ఆరోపించారు.  దీని మీద టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీని మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

Latest Videos


ఈ క్రమంలోనే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ పార్టీ నేతకు, కాంగ్రెస్ నేతకు ట్విట్టర్ వేదికగా చురకలాంటించారు. వరుస ట్వీట్లతో ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 

నిరంతరం తెలంగాణ కోసం పోరాడే తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ప్రస్తుత సందర్భంలో తన బాధ్యత అని విజయశాంతి అన్నారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. 

ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వం మీద పోరాడడం అవసరమని అనిపిస్తుందని సూచించారు.  తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వీరిద్దరికీ ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని చెప్పడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ కొనసాగుతుందన్నారు.  

తెలంగాణలోని రాజకీయ కార్యకర్తలందరికీ ఈ విషయం తెలుసని.. గత తొమ్మిదేళ్లుగా వారంతా చూస్తున్న వాస్తవం ఇదని అన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులపై కాక ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల సవాల్ ల దాడులు టిఆర్ఎస్ కు వేడుకలు అవుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. 

తెలంగాణలోని రాజకీయ కార్యకర్తలందరికీ ఈ విషయం తెలుసని.. గత తొమ్మిదేళ్లుగా వారంతా చూస్తున్న వాస్తవం ఇదని అన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులపై కాక ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల సవాల్ ల దాడులు టిఆర్ఎస్ కు వేడుకలు అవుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. 

click me!