దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాల్లో విజయం కోసం ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరింది. అయితే ఈ విషయమై బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకోనుంది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుండి నరేంద్ర మోడీ పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవడంలో మోడీ పోటీ దోహదపడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
2014 ఎన్నికలకు ముందే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అమిత్ షా మకాం వేశాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మోడీ చేస్తే బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని భావించాడు. మోడీని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ చేయాలని కోరారు.దీంతో వారణాసి నుండి మోడీ పోటీ చేశారు.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
అయితే దక్షిణాదిలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. దక్షిణాదిలో గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ ఏడాది మే మాసంలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కూడ బీజేపీ అధికారానికి దూరమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ దఫా కనీసం 12 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండి నరేంద్ర మోడీ ఎంపీగా పోటీ చేస్తే దాని ప్రభావం దక్షిణాదిపై చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుండి మోడీని పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నెలకొంది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల నుండి నరేంద్ర మోడీని పోటీ చేయాలని బీజేపీ నేతలు కోరారని ప్రచారం నెలకొంది. ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని బీజేపీ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
ఇదిలా ఉంటే తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కూడ పోటీ చేయాలని ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఇందిరా గాంధీ 1980లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
దీంతో తెలంగాణ నుండి పోటీ చేయాలని సోనియా గాంధీని రాష్ట్ర నాయకత్వం కోరుతుంది. దక్షిణాదిలో సోనియా గాంధీ పోటీ చేస్తే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దక్షిణాది నుండి కాంగ్రెస్ పార్టీ అధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.