నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపై అనుముల రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విపక్షంలో ఉన్న సమయంలో కొందరు ఐఎఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఐఎఎస్ అదికారులపై ఆరోపణలు చేశారు. అధికారుల మాదిరిగా కాకుండా పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని కూడ అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగించారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ , అరవింద్ కుమార్, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, రజత్ కుమార్, జయేష్ రంజన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ వంటి వారిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజున కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనపై కేంద్రీకరించారు. సమర్ధవంతమైన అధికారులను తన టీమ్ లోకి తీసుకుంటున్నారు.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను రేవంత్ రెడ్డి పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించిన అరవింద్ కుమార్ ను ప్రధాన శాఖల నుండి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పించింది.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
విపత్తుల నిర్వహణ శాఖకు అరవింద్ కుమార్ ను బదిలీ చేసింది. తెలంగాణకు చెందిన అధికారులతో పాటు ఇప్పటివరకు లూప్ లైన్లలో ఉన్న అధికారులకు కీలక పోస్టుల్లో రేవంత్ సర్కార్ నియమించింది.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయమై రేవంత్ రెడ్డి అప్పటి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ కనుసన్నల్లో ఈ లీజు వ్యవహరం జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ ఆరోపణలు చేశారు.అయితే ఈ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, రఘునందన్ రావుపై హెచ్ఎండీఏ అధికారులు నోటీసులు పంపారు.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
మరో వైపు ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయమై మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం కోసం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులకు రేవంత్ రెడ్డి ధరఖాస్తు అందించారు. అప్పట్లో అరవింద్ కుమార్ వ్యవహరించిన తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
అరవింద్ కుమార్ పై రేవంత్ రెడ్డి వేటేశాడు. విపక్షంలో ఉన్న సమయంలో ఆరోపణలు చేసిన ఇతర ఐఎఎస్ అధికారుల పరిస్థితి ఏమిటనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇతర ఐఎఎస్ అధికారులను కూడ తప్పిస్తారా అనే చర్చ సాగుతుంది. సీఎంఓలో కూడ తనకు నచ్చిన అధికారుల నియామకం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు. సీఎంఓలో అధికారుల నియామకం జరగాల్సి ఉంది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో పనిచేసిన అధికారులను కొనసాగించే అవకాశం లేదు.గతంలో సీఎంఓలో పనిచేసిన స్మితా సభర్వాల్ సీతక్క నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు