1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

First Published | Dec 18, 2023, 5:46 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్(ఐ) అభ్యర్ధిగా పోటీ చేసి  ఇందిరా గాంధీ విజయం సాధించారు. తెలంగాణ నుండి సోనియాను పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు  కోరారు.ఈ మేరకు పీఏసీ సమావేశంలో తీర్మానించారు.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

 భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ ఎంపీ స్థానం నుండి  1980లో  కాంగ్రెస్(ఐ) అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. 

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

1977లో దేశం ఎమర్జెన్సీని విధించింది ఇందిరా గాంధీ.ఆ సమయంలో  విపక్షపార్టీలకు చెందిన  నేతలను జైళ్లలో నిర్భంధించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.  1977 మార్చి 24 నుండి  1979 జూలై  28 వరకు మురార్జీ దేశాయ్ ప్రధానిగా కొనసాగారు. 1979 నుండి  1980 వరకు  చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

1980లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుండి  ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంది. 
 
1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

1980లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాల్లో  41 స్థానాల్లో  కాంగ్రెస్(ఐ) అభ్యర్దులు విజయం సాధించారు. ఒక్క స్థానంలోనే  ఐఎన్‌సీ(యు)అభ్యర్ధి  గెలుపొందారు.  మెదక్ లో ఇందిరాగాంధీపై  జనతా పార్టీ అభ్యర్ధిగా సూదిని జైపాల్ రెడ్డి  అప్పట్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు కీలక పాత్ర పోషించారు.
 
1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

 2004 పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  29 ఎంపీ స్థానాలను దక్కించుకుంది.  41.6 శాతం ఓట్లతో  29 ఎంపీ స్థానాల్లో  కాంగ్రెస్ విజయం సాధించింది.  33.1 శాతం ఓట్లతో  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులు  ఐదు చోట్ల విజయం సాధించారు.  6.8 శాతం ఓట్లతో  ఐదు చోట్ల భారత రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి) అభ్యర్థులు గెలుపొందారు.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

2004 ఎన్నికల్లో 1.3 శాతం ఓట్లతో  సీపీఐ, 1శాతం ఓట్లతో సీపీఐ(ఎం) అభ్యర్ధి విజయం సాధించారు. ఒక్క స్థానంలో  ఎంఐఎం విజయం సాధించింది. ఇక  2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రెండో దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఆనాడు  కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల పాత్ర కీలకమైంది. 2009 ఎన్నికల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  39 శాతం ఓట్లతో  33 ఎంపీ స్థాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. 24.9 శాతం ఓట్లతో  తెలుగుదేశం పార్టీ  ఆరు స్థానాలకే పరిమితమైంది. 6.1 శాతం ఓట్లతో  భారత రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి) రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందింది.

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు.  2014, 2018 ఎన్నికల్లో  తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని దక్కించుకుంది.  2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2024 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.  2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది.  వచ్చే ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది.  

తెలంగాణ నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఇవాళ  కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో  ఈ తీర్మానం చేశారు.  తెలంగాణ నుండి పోటీ చేయాలని  తెలంగాణ నేతలు  చేసిన వినతిపై  సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలకంగా వ్యవహరించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  ఈ కారణంగానే తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరుతున్నారు. 

1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

మరో వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుండి  ఇందిరా గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ నుండి  సోనియా గాంధీని పోటీ చేయాలని  కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తే  దాని ప్రభావం దక్షిణాదిపై  చూపే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

Latest Videos

click me!