దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

First Published | Feb 9, 2024, 5:33 PM IST

మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావుకు భారతరత్నను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో  బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

2019లో  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  భారత రత్న ప్రకటించిన తర్వాత  మాజీ ప్రధాన మంత్రి  పీ.వీ. నరసింహారావుకు  కేంద్రప్రభుత్వం  భారతరత్నను ప్రకటించింది.
 
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు  పీ.వీ. నరసింహారావుకు  భారత రత్న ఇవ్వడం వెనుక  బీజేపీ  వ్యూహాత్మక ఎత్తుగడగా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావుకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రత్యర్థులు  అవకాశం దొరికినప్పడల్లా విమర్శలు చేస్తుంటారు. మరో వైపు పీ.వీ. నరసింహారావుకు మోడీ సర్కార్  భారతరత్నను ప్రకటించి రాజకీయంగా వ్యూహాత్మకంగా పై చేయి సాధించిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.  పీ.వీ. నరసింహారావు జయంతి, వర్థంతి వేడుకలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ సహా విపక్షాలు  ఆరోపించాయి.
 
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

పీ.వీ. నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం ద్వారా రాజకీయంగా పై పైచేయి సాధించిందనే అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పీ.వీ. నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం ద్వారా  కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బకొట్టింది. అదే సమయంలో  దక్షిణాదిపై  విస్తరణ కోసం  ఈ అవకాశాన్ని వినియోగించుకోనుందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

ఇప్పటికిప్పుడు  లోక్ సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ  17 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని  ఇండియా టుడే  సర్వే తెలిపింది.

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి కూటమిగా ఏర్పాటయ్యే  అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. రెండు రోజుల క్రితం  చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో చర్చించారు.

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

2014లో  టీడీపీతో బీజేపీతో పొత్తుంది.  గత ఎన్నికల్లో  7.22 ఓట్ల శాతంతో బీజేపీ రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.టీడీపీ  16 సీట్లలో విజయం సాధించింది.

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడ  బీజేపీ  ఎనిమిది  అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.  2018 ఎన్నికల్లో  ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. కానీ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది. గతంలో కంటే  తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ బలం పెంచుకున్నామని కమలనాథులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో రెండంకెల స్థానాలను కైవసం చేసుకోవాలని  కమలం పార్టీ  కార్యాచరణను సిద్దం చేస్తుంది

Latest Videos

click me!