School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా

Published : Dec 08, 2025, 08:01 PM IST

School holidays: విద్యార్థులకు డబుల్ ధమాకా.. స్కూళ్లకు వరుస సెలవులు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల కారణంగా డిసెంబర్‌లో విద్యాసంస్థలకు వరుస సెలవుల అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు, ఉద్యోగులకు పెద్ద బ్రేక్ దొరకనుంది.

PREV
14
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌తో వరుస సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుస సెలవులు రానున్నాయి. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈ నెలలో విద్యాసంస్థల కార్యకలాపాలపై పెద్ద ప్రభావం చూపనున్నాయి. మొత్తం మూడు విడతలుగా అంటే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

ఈ రోజుల్లో అనేక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించనున్నారు. దీనివల్ల స్కూల్స్, కాలేజీల్లో కార్యకలాపాలు నిలిచే అవకాశం ఉంది. మొదటి విడత ప్రాంతాల్లో డిసెంబర్ 10, 11, మూడో విడత పోలింగ్ ప్రాంతాల్లో డిసెంబర్ 16, 17 తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

24
కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఓటు హక్కు

ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం TSTCEA రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఇప్పటికే వినతి పత్రం సమర్పించింది. పలు విశ్వవిద్యాలయాలు.. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ పోలింగ్ రోజుల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవడం పట్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వేలాది మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని, పరీక్షలు, పోలింగ్ ఒకేసారి జరగడం వల్ల చాలా మంది ఓటింగ్‌కు దూరమవుతారని వారు హెచ్చరించారు. ఆయా రోజుల్లో సెలవులు ఇవ్వాలని కోరారు.

34
స్కూళ్లకు సెలవులు: త్వరలోనే ప్రభుత్వం ప్రకటన

ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం గరిష్ఠ ఓటరు పోలింగ్ సాధించడం. అయితే పరీక్షలు, పని దినాలు, ప్రయాణ సౌకర్యాల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పోలింగ్ రోజుల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించాలని సంఘం డిమాండ్ చేస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నందున వారికి ప్రయాణ సమస్యలు మరింత తీవ్రమవుతాయని అంటున్నారు. ప్రభుత్వం త్వరలోనే సెలవులపై క్లారిటీ ఇవ్వనుంది.

44
డిసెంబర్ నెలలో వరుసగా సెలువులు

డిసెంబర్ నెలలో సాధారణ సెలవులు రెండో శనివారం (13), ఆదివారం (14), క్రిస్మస్ (25), బాక్సింగ్ డే (26) ఇప్పటికే ఉన్నాయి. పంచాయతీ పోలింగ్ కారణంగా మరో 4 అదనపు సెలవులు చేర్చితే, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలలో భారీ బ్రేక్ లభించే అవకాశం ఉంది. క్రిస్మస్ ఈవ్ (24) ఐచ్చిక సెలవు కూడా కలుపుకుంటే, విద్యాసంస్థలకు దాదాపు 10 రోజుల వరకూ సెలవులు లభించనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories